Drunk Girl Kicks Police Officer: దేశంలో తాగుడు వ్యసనం ఓ ప్రహసనంలా మారుతోంది. మద్యం ప్రియుల ఆగడాలకు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఫలితంగా అగచాట్లు తప్పడం లేదు. ఈనేపథ్యంలో తాగుడు వ్యసనం ఆగడం లేదు. ప్రమాదాలు సైతం అదేవిధంగా నమోదు కావడం గమనార్హం. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. సాటి వారిని సైతం ఆపదల్లో పడేస్తున్నారు. అయినా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపడుతున్నా భయపడటం లేదు. తాగుడు వ్యసనపరుల తీరుతో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి.

తాజాగా ముంబైలో ఓ యువతి తాగిన మైకంలో అందరిని బెదిరింపులకు గురిచేసింది. నడిరోడ్డుపై వచ్చిపోయే వారిని ఆపుతూ వారిపై చిందులు తొక్కింది. అటుగా వచ్చిన పోలీసులను సైతం తన మాటలతో భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వారు ఏం చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోయారు. యువతి నిర్వాకంతో నివ్వెరపోయారు. తాము పోలీసులమైనా ఆమె చేష్టలకు చోద్యం చూశారు. ఏమైనా చర్యలు తీసుకుందామంటే ఆమె లేడీ కావడంతో ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
Also Read: Ram Gopal Varma- Apsara Rani: అప్సర అందాలను తట్టుకోలేక రాంగోపాల్ వర్మ ఏం చేశాడో తెలుసా?

పోలీసులపై బెదిరింపు మాటలతోనే కాదు చేతలతో కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసు కాలర్ పట్టుకుని నిలదీసింది. తాగి ఉండటంతో ఏదైనా చేయాలన్నా ఆడది కావడంతో వారు ఏమి మాట్లాడలేకపోయారు. కిమ్మనకుండా ఉండిపోయారు. దీంతో ఆమె నానా హంగామా చేసింది. వారి జుట్టు పట్టుకుని ఈడ్చింది. ఆమె అంతలా రెచ్చిపోతున్నా వారు మాత్రం నోరు మెదపలేదు. ఆమె తాగిన మైకంలో చిందులు తొక్కుతూ వీరంగం సృష్టించింది.
एक और परी की Video Viral है।
देखिए कैसे एक पुलिस अधिकारी की वर्दी का कॉलर पकड़ कर खड़ी है और पुलिस वाला बेबस है।
क्योंकि जानता है गलती से अगर उसने लड़की को ही हाथ लगा दिया तो क़ानून उसको ही नाप देगा। pic.twitter.com/5AHtj3E2A7
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 19, 2022
Also Read:Manchu Vishnu Jinnah Movie: జిన్నా’ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!