DonaldTrump : వెనుకటికి జర్మనీలో హిట్లర్ పరిపాలన సాగుతున్నప్పుడు.. అతడి కార్యాలయంలోకి కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉండేది. అలా ప్రవేశించిన వారితో హిట్లర్ కోపంగా కాకుండా సరదాగా మాట్లాడుతుండే వారట. వాస్తవానికి హిట్లర్ మనస్తత్వం సరదాతనమే అయినప్పటికీ.. ఆయన ప్రపంచాన్ని మొత్తం ఏలేయాలని ఉద్దేశంతో అవసరంలేని కోపాన్ని.. ఉపయోగం లేని ఆగ్రహాన్ని తన ఒంట పట్టించుకున్నారు. ప్రపంచంలోనే నరరూప రాక్షసుడిగా పేరుపొందారు. బహుశా హిట్లర్ చరిత్ర తెలిసిందో..హిట్లర్ గురించి తెలుసుకున్నారో తెలియదు కాని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త మారిపోయారు. ప్రపంచ దేశాల మీద వాణిజ్య సుంకాలు.. రకరకాల ఇబ్బందులు ప్రయోగిస్తున్న వేళ తొలిసారిగా ఆయన తనలో ఉన్న చిలిపి వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది గ్లోబల్ మీడియాలో విశేషంగా సర్క్యులేట్ లో ఉంది. ఇంతకీ ట్రంప్ తనలో ఉన్న చిలిపి వ్యక్తిని ఎలా బయటపెట్టాడంటే.. ఆ సందర్భం ఎలా వచ్చిందంటే..
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుల్ మేక్రాన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన భార్య పేరు బ్రిగెట్టా. అతడి కంటే ఆమె వయసులో చాలా పెద్ద. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు అతడికి ఆమె పాఠాలు కూడా చెప్పింది. సరే ఇదంతా ఒక ఎత్తయితే.. ఇటీవల మెక్రాన్, బ్రిగెట్టా గొడవపడ్డారు. బ్రిగెట్టా మెక్రాన్ ను తోసి వేసింది. ఆ వీడియో కాస్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై మెక్రాన్ వివరణ ఇచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.. ఇలాంటివి జరుగుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ముఖ్యంగా డోర్లు వేసి ఉన్నాయో లేదో చూసుకోవాలని చమత్కరించారు.. ఓవల్ లోని ఒక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్వేత దేశం అధ్యక్షుడు మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ఫ్రాన్స్ అధ్యక్షుడు, అతడి సతీమణి మధ్య జరిగిన వ్యవహారంపై స్పందించాలని కోరారు..” నేను నేరుగా ఫ్రాన్స్ అధ్యక్షుడితోనే మాట్లాడాను. అక్కడ పరిస్థితి బాగానే ఉంది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి పరీక్షించుకోవాలి” అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ ట్రంప్ ఇదే విధంగా మాట్లాడారు.
రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ పూర్తిగా తనలో ఉన్న చిలిపితనాన్ని బయటపెడుతున్నారు. ఇటీవల కెనడా విషయంలోనూ ఇలానే మాట్లాడారు. “పాపం అప్పుడప్పుడు వాళ్లకు ఏదో సమస్య వస్తుంటుంది. దానిని నేను గుర్తు చేయాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు కంటే ఈ బాధ్యత నాకు ఎక్కువైపోయిందని” ట్రంప్ వ్యాఖ్యానించడంతో అక్కడున్నవారు మొత్తం ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు, అతని భార్య మధ్య ఇటీవల విభేదాలు వచ్చాయని ఫ్రాన్స్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. ఈ జంట వియత్నాం లో పర్యటించడానికి ఇటీవల వెళ్ళింది. ఈ క్రమంలో హనోయ్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిని అతడి సతీమణి తోసివేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పడి సంచలనంగా మారింది. అయితే దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. ఇలాంటివి మా మధ్య సర్వసాధారణమని వ్యాఖ్యానించారు.
Asked about his thoughts on French President Emmanuel Macron getting slapped by his wife, Brigitte:
President Trump: “Make sure the door remains closed. That was not good. I spoke to him and he’s fine, they’re fine.” pic.twitter.com/TcXb5aQUSv
— Conservative War Machine (@WarMachineRR) May 30, 2025