https://oktelugu.com/

TATA Airhostes: టాటాల ‘స్వదేశీ’ మర్యాద.. అంతా ‘ఫిదా’

TATA Airhostes: టాటా… ఈ బ్రాండ్ గురించి భారత్ లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్రిటీష్ వారి హయాంలోనే పరిశ్రమలు, విమానయాన సంస్థ స్థాపించి దేశంలో పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన వారు వీరు. ఇప్పటికే ప్రజాసంక్షేమమే తప్పితే ప్రపంచంలో కుబేరులుగా ఎదుగుదామన్న ధ్యాస వీరికి లేదు. అందుకే అంబానీలు, అదానీలు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతుంటే.. టాటాలు మాత్రం తమ సేవా తత్పరతతో ప్రజాసేవ కోసం ఫౌండేషన్లు పెట్టి కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందుకే భారత్ లో ‘టాటా’ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2022 / 04:17 PM IST
    Follow us on

    TATA Airhostes: టాటా… ఈ బ్రాండ్ గురించి భారత్ లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్రిటీష్ వారి హయాంలోనే పరిశ్రమలు, విమానయాన సంస్థ స్థాపించి దేశంలో పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన వారు వీరు. ఇప్పటికే ప్రజాసంక్షేమమే తప్పితే ప్రపంచంలో కుబేరులుగా ఎదుగుదామన్న ధ్యాస వీరికి లేదు.

    TATA Air hostes

    అందుకే అంబానీలు, అదానీలు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతుంటే.. టాటాలు మాత్రం తమ సేవా తత్పరతతో ప్రజాసేవ కోసం ఫౌండేషన్లు పెట్టి కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందుకే భారత్ లో ‘టాటా’ అంటే ఒక బ్రాండ్.. ఒక నమ్మకం.. టాటా పేరు చెబితే చాలు కళ్లు మూసుకొని కొనేస్తారు.

    Also Read: ఉద్యోగుల్లో చీలిక తెచ్చే దిశగా.. జగన్ సర్కారు ఎత్తుగడలివే..!

    ఈ క్రమంలోనే 18వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను..కరోనా దెబ్బకు కుదేలైన విమానయానంను బతికించేందుకు దేశంలోనే అపరకుబేరులైన అంబానీలు, అదానీలు ముందుకు రాలేదు. అదే దేశ ప్రతిష్టకు ఆయువుపట్టుగా ఉన్న ఎయిర్ ఇండియాను ‘టాటా’లు అంత మొత్తం పెట్టి కొన్నారు. అంతేకాదు.. భారతీయ సంప్రదాయాన్ని తాజాగా ఇనుమడింపచేశారు.

    భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేసేలా మోడ్రన్ దుస్తులు ధరించే ఎయిర్ హోస్టెస్ ను సంప్రదాయ చీరలు కట్టించి వారితో చేతులు జోడించి నమస్కారం పెట్టించి ఆహ్వానించేలా విమానంలో ఏర్పాటు చేశారు. ఇలా సంప్రదాయంలోనూ ‘టాటా’లు చూపిన శ్రద్ధకు దేశ ప్రజలంతా ఫిదా అవుతున్నారు.

    Also Read: ఆమెకు కరోనా పాజిటివ్.. అమితాబ్ పరిస్థితి ఏమిటి ?