
Namrata: ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా జనాల్లో స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలనే ఆలోచన పెరిగింది. మారిన జీవన శైలి రీత్యా ప్రతి ఒక్కరికీ అధిక బరువు సమస్య ఎదురవుతుంది. అందుకే ఫిట్నెస్ సెంటర్స్ జనాలతో నిండిపోతున్నాయి. ఇక సెలబ్రిటీల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. అందంగా కనిపించడం కోసం వాళ్ళు చాలా త్యాగాలు చేస్తారు. ముఖ్యంగా కడుపు మాడ్చుకొని డైటింగ్ లు చేస్తారు. ఏది పడితే అది తినకుండా నియమాలు పాటిస్తారు. తమ దినచర్యలో వ్యాయామం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు.
కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రతా శిరోద్కర్ ఐదు పదుల వయసులో మెస్మరైజింగ్ గ్లామర్ మైంటైన్ చేస్తున్నారు. నమ్రత ఏజ్ కి ఆమె లుక్ కి సంబంధం లేదు. పిల్లల్ని కన్నాక మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నలభై ఏళ్ళు దాటాక ఈజీగా షేప్ అవుట్ అవుతారు. నమ్రత మాత్రం అందుకు భిన్నం. ఆమె సూపర్ ఫిట్ బాడీ కలిగి ఉన్నారు. నమ్రత ప్రస్తుత వయసు 51 ఏళ్ళు కాగా… అంత వయసుందంటే ఎవరూ నమ్మరు. ఆమె 25 ఏళ్ల వద్దే ఆగిపోయారు.
కాగా గ్లామర్ లో మహేష్ తో పోటీ పడుతున్న నమ్రత ఫిట్నెస్ సీక్రెట్ బయటపడింది. అందమైన శరీరాకృతి కోసం నమ్రత ఎంతగా కష్టపడతారో తెలియజేస్తూ వీడియో షేర్ చేశారు. నమ్రత ప్రొఫెషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో కఠిన కసరత్తులు చేస్తున్నారు. అసలు అంత సహనంగా గంటల తరబడి వ్యాయామం చేయాలన్నా పట్టుదల, నిగ్రహం ఉండాలి. నమ్రత మహేష్ కంటే నాలుగేళ్లు పెద్దది. అయినప్పటికీ ఆమె ఫిట్నెస్ కాపాడుకుంటూ అందంలో మహేష్ కి తగ్గ భార్య అనిపించుకుంటున్నారు.

2005లో ప్రేమ వివాహం చేసుకున్న నమ్రత-మహేష్ ఇటీవల 18వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. వీరికి గౌతమ్, సితార సంతానం. పిల్లలిద్దరూ టీనేజ్ కి వచ్చేశారు. నమ్రత భర్త మహేష్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. ఆయన సంపాదన వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడతారు. అదే సమయంలో సామాజిక సేవ చేస్తారు. మహేష్ బాబు ఫౌండేషన్ తరపున వందల మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయించారు. ఏపీ, తెలంగాణాలలో రెండు గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు.
View this post on Instagram