
Train Speed: ప్రయాణ సౌకర్యాలలో రైలు ప్రయాణమే బాగుంటుంది. చౌకగా సౌకర్యవంతంగా ఉండటంతో అందరు దీన్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా రైలు ప్రయాణంలోనే చాలా మంది తమ గమ్యస్థానాలు చేరుతున్నారు. ప్రపంచంలోనే నాలుగోదిగా పేరు పొందిన రైల్వే వ్యవస్థ మన సొంతం. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా, నాలుగో స్థానంలో మనం ఉన్నాం. మనది అత్యంత పురాతనమైన రైల్వే వ్యవస్థ. స్వాతంత్ర్యానికి పూర్వమే మనదేశంలో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆంగ్లేయులు.
అమెరికాలో 2,50,000 పొడవు రైల్వే వ్యవస్థ ఉంది. మనదేశంలోని రైళ్లలో చాలా మంది ప్రయాణిస్తుంటారు. బారతీయ రైల్వే వ్యవస్థ ఎప్పుడో ప్రారంభమైంది. జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతటి అనుబంధం రైల్వే వ్యవస్థతో మనకు ఉంది. ఈ నేపథ్యంలో మన రైల్వే వ్యవస్థ రోజుకు ఎంతో మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది.
రైళ్లు మధ్యాహ్నం కంటే రాత్రుళ్లు వేగంగా పరుగెడతాయని చెబుతారు. ఇందులో ఉన్న రహస్యమేమిటో. రాత్రి పూట అలికిడి తక్కువగా ఉంటుంది. పైగా మరమ్మతులు వంటివి మధ్యాహ్న సమయంలో చేయడం వల్ల రైళ్లు మెల్లగా నడుస్తాయి. రాత్రి పూట ఎక్కువ దూరం నుంచి కూడా సిగ్నల్స్ కనిపిస్తాయి. అందుకే రైలు వేగంగా నడుస్తుంది. రాత్రి ట్రాక్ కదలికల మధ్య పరిధి తక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల రైలు రాత్రి వేగంగా పరుగెడుతుంది.

రైలులో ప్రయాణం చౌకగా ఉంటుంది. అదే బస్సు ప్రయాణమైతే మన జేబు గుల్లే. అందుకే ఎక్కువ మంది బస్సు కంటే రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తుంటారు. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు రైల్వే వ్యవస్థలో ఉంటుంది. మనం బొంబాయి లాంటి ప్రదేశాలకు వెళ్లినా రూ.500 వరకు ఉంటుంది. అదే బస్సుకు వెళితే రూ.వెయ్యి గోవిందా. ఇలా టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్లే రైల్వేలో మన చేరాల్సిన చోటుకు వెళ్లిపోతున్నాం.