https://oktelugu.com/

Drushyam2: ‘దృశ్యం2’లో మెరిసిన ఈ నటి ఎవరో తెలుసా?

Drushyam2: కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి. అందులోని పాత్రలు జీవిస్తాయి. ఆ పాత్రలు చేసిన వారు ఒక్కరోజులో స్టార్లు అయిపోతారు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్ర చేసిన రాహుల్ రామకృష్ణ ఆ ఒక్క సినిమాతో స్టార్ కమెడియన్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు దృశ్యం2లో హీరో వెంకటేశ్ ఇంటిపక్కన ఇక ఇల్లాలి పాత్రలో.. భర్త చేతిలో వేధింపులకు గురయ్య సరిత పాత్రలో నటించిన నటి అద్భుతమైన పర్ ఫామెన్స్ తో అలరించింది. అండర్ కవర్ పోలీస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2021 / 02:18 PM IST

    drushyam2-actress-varuni

    Follow us on

    Drushyam2: కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి. అందులోని పాత్రలు జీవిస్తాయి. ఆ పాత్రలు చేసిన వారు ఒక్కరోజులో స్టార్లు అయిపోతారు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్ర చేసిన రాహుల్ రామకృష్ణ ఆ ఒక్క సినిమాతో స్టార్ కమెడియన్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు దృశ్యం2లో హీరో వెంకటేశ్ ఇంటిపక్కన ఇక ఇల్లాలి పాత్రలో.. భర్త చేతిలో వేధింపులకు గురయ్య సరిత పాత్రలో నటించిన నటి అద్భుతమైన పర్ ఫామెన్స్ తో అలరించింది. అండర్ కవర్ పోలీస్ గా ఉంటూ ఈ పాత్ర చేసిన నటికి ప్రత్యేక గుర్తింపు లభించింది.

    suja varuni

    ఈమె ఎవరూ అని అందరూ ఆరాతీస్తున్నారు. కానీ ఈమె ఒక పెద్దింటి కోడలు. కష్టపడి ఎదిగింది. సొంతంగా పేరు సంపాదించుకుంది. తమిళ బిగ్ బాస్ లో మొదలైన ఈమె ప్రస్థానం నటిగా గుర్తింపు తెచ్చుకునే వరకూ సాగింది.

    విక్టరీ వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం2’(Drushyam 2). గురువారం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దృశ్యం1 సినిమా కంటిన్యేషన్ మూవీగా ఇది వచ్చింది. మలయాళ సినిమాను అంతే చక్కగా తెలుగులో తీశారు.

    Also Read: నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన వెంకటేష్ “దృశ్యం 2 ”

    ఈ సినిమాలో సరిత అనే పాత్రలో నటించిన సుజా వరుణి(Suja Varuni) నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈమె ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది.సుజా వరుణి అసలు పేరు సుజాత. ప్రఖ్యాత తమిళనటుడు శివాజీ గణేషన్ మనవడు శివాజీ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సుజా వరుణి. ఈమె భర్త ఏకంగా ఐదేళ్లు చిన్నా.. అయినా ప్రేమించి చేసుకొని వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.

    2002లో సుజా వరుణి నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ప్లస్ 2 అనే కోలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులోనూ నటించింది. ‘అలీబాబా ఒక్కడే దొంగ’, గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, నాగవళ్లి సినిమాల్లోచిన్న పాత్రల్లో నటించింది. అనంతరం తమిళ బిగ్ బాస్ 1లో మొదటి సీజన్ లో పాల్గొని 13 వారాలు ఉండి పాపులర్ అయ్యింది. ప్రస్తుతం దృశ్యం2తో ఇరగదీసే పాత్రలో నటించి మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమాతో సుజా వరుణికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

    Also Read: దృశ్యం2 రివ్యూ