Beauty Tips: ఇటీవల కాలంలో అందరు అందానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందంగా కనిపించాలని ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. దీంతో చర్మం అందవిహీనంగా మారడం సహజం. అందం కోసం పొరపాటున ఏది పడితే అది వాడితే కీడు చేస్తాయి. అన్ని తెలుసుకుని వాడితేనే అందానికి ఎలాంటి ఇబ్బందులు రావు. ఆడవారైతే అందం కోసం పరితపిస్తుంటారు. తాము అందంగా కనిపించాలని కలలు కంటుంటారు. కల నెరవేర్చుకోవడానికి ఏవో దారులు వెతుకుతుంటారు.

మనం పడుకునే సమయంలో తల కింద పెట్టుకునే దిండుపై ఎన్నో సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని శుభ్రం చేయకుండా నిత్యం అలాగే వాడితే అందులో ఉండే మురికి, సూక్ష్మక్రిములు ముఖం, చర్మంపై చేరి హాని కలిగిస్తాయి. మొటిమలు వంటి చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. దిండు కవర్లను వారానికోసారైనా శుభ్రం చేసుకోవాలి. ఇంకా ముఖం తుడుచుకునే టవళ్లను కూడా ఉతుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మూడు రోజులకోసారైనా టవళ్లను ఉతుక్కోవాలి.
వేడినీటితో స్నానం చేస్తే ఇబ్బందులొస్తాయి. శరీరం తేమగా ఉండేందుకు చర్మం సహజంగా ఉత్ప్తత్తి చేసే నూనెను వేడినీరు తొలగిస్తుంది. ఇలా చేస్తే చర్మం పొడిబారుతుంది. నిర్జీవంగా అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీరు, గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. ముఖం కడగటానికి వేడినీరు ఉపయోగించకూడదు. ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు ఎండ బారి నుంచి రక్షించుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుంటే చర్మం కమిలిపోతుంది. పొడిబారిపోతుంది. ఫలితంగా ఇబ్బందులొస్తాయి.

నాణ్యమైన సన్ స్క్రీన్ లోషన్ పూటకోసారి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమతో మృదువుగా మారుతుంది. రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు ముఖంపై క్రిములు చేరి చర్మం కళావిహీనంగా మారుతుంది. ఇలాంటి సమయంలో చర్మ సమస్యలు వేధించే అవకాశముంది. రోజుకు రెండు మూడు సార్లయినా ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. లేదంటే జిడ్డులా మారుతుంది. అందవిహీనంగా కనబడుతుంది. అందాన్ని ఆరాధించే వారు జాగ్రత్తలు తీసుకుంటేనే చెడిపోకుండా ఉంటుంది. లేదంటే ముఖంపై ఇతర సమస్యలు ఏర్పడితే తొలగించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది.
టుబాకాలో ఉండే నికోటిన్ చర్మానికి రక్తప్రసరఫరాను తగ్గిస్తుంది. దీంతో ఆక్సిజన్, పోషకాలు అందక చర్మం దెబ్బతింటుంది. పెదాలు, కళ్ల వద్ద ముడతలు ఇబ్బంది పెడతాయి. పొగ తాగొద్దు. వీలైనంత వరకు సిగరెట్లు తాగడం మానేయాలి. తియ్యని పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరతాయి. చర్మం సాగిపోయి అందవిహీనంగా కనిపిస్తుంది. స్వీట్లను దూరం పెట్టాలి. పండ్లు తింటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఏర్పడే మొటిమలను చిదిమేయకూడదు. దీని వల్ల కూడా మరిన్ని మొటిమలు రావడం, మరకలు ఏర్పడటం, ఇన్ఫెక్సన్లు వస్తుంటాయి. మొటిమలు పోవడానికి సరైన చిట్కాలు పాటిస్తే మంచిది.