Tollywood Heroes Favourite Food: సినీ స్టార్లు వెండితెరపై చేసే సందడి మాములుగా ఉండదు. వారి నటనకు ఫిదా అయిన అభిమానులు వారి గురించి ఎప్పటికీ తెలుసుకుంటూ ఉంటారు. స్టార్లు కూడా అభిమానులను అలరించడానికి తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. కొందరు నటులు తాము తినే ఆహారం గురించి కూడా చెబుతూ అలరిస్తారు. హీరోయిన్లు అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యే ఫుడ్ మెయింటెన్ చేస్తారు. లైట్ ఫుడ్ తీసుకొని నిత్యం ఎనర్జిటిక్ గా ఉంటారు. అటు హీరోలు సైతం బాడీ ఫిట్ నెస్ కోసం ఏదీ పడితే అది తినకుండా ఆరోగ్య నియమాలు పాటిస్తారు. కానీ కొందరు మాత్రం ఫుడ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. తమకు ఇష్టమైన ఫుడ్ ను అమితంగా తినేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో మన టాలీవుడ్ హీరోలకు ఎలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టమో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి:
టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ హీరో మెగాస్టార్ సినిమాలంటే ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఆయన పర్సనల్ విషయాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. కొన్ని సార్లు మెగాస్టార్ వంట చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా సమయంలో ఆయన ఇంట్లో ఉండగా.. వంట గదిలో ఉన్న ఫొటోలు ఆసక్తిని రేపాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ తాను ఇష్టంగా తినే ఆహారంపై చెప్పారు. ఆయన ఎక్కువగా స్టీమ్ దోశ తింటారట. రోజు తినే ఆహారంలో దోశ ఉండే విధంగా చూసుకుంటాడట. అంతేకాకుండా దీనిని స్వయంగా చిరు చేసి చాలా మందికి సర్వ్ చేశారట.
బాలకృష్ణ:
తెలుగు సీనియర్ స్టార్ హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఏజ్ భారైనా యంగ్ కుర్రాళ్లకు పోటీనిస్తూ సినిమాలు తీస్తున్నాడు. బాలకృష్ణ కూడా ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన తినే ఆహారంపై చెప్పారు. బాలకృష్ణ రొయ్యలు, చికెన్ బిర్యానీని ఇష్టంగా లాగించేస్తారు.
పవన్ కల్యాణ్:
సినీ, రాజకీయాల్లో బిజీ అయిన పవన్ తన పర్సనల్ విషయాలు ఓపెన్ అవుతాడు. తన కుటుంబ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక పవన్ నాటుకోడి చికెన్ కర్రీతో పాటు పులిహోరను అమితంగా తింటారట. అయితే ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కాస్త లైట్ ఫుడ్ తీసుకుంటున్నారని సమాచారం.
మహేశ్ బాబు:
సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ఆయన సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు ఆడియన్స్ కు చెబుతుంది. తమ ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తాయి. ఈ సందర్భంగా మహేశ్ తినే ఆహారంపై కూడా తెలిపింది. మహేశ్ ఎక్కువగా ధమ్ బిర్యానీతో పాటు ఫిష్ సూప్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటారట.
అల్లుఅర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నాడు. ఈమధ్య ఈ యంగ్ హీరో అభిమానులు అలరించి ఆసక్తి విషయాలు చెబుతున్నారు. ఈ క్రమంలో తాను తినే ఫుడ్ గురించి సన్నిహితుల వద్ద చెప్పాడట. ఆయన ఎక్కువగా చికెన్ దమ్ బిర్యాని తీసుకుంటారట. ఇది ప్రతిరోజు పెట్టినా వద్దనకుండా తింటారట.
ప్రభాస్:
ప్రభాస్ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. అందుకే ఆయన ఫిట్ గా కనిపిస్తారు. అయితే ఆయన ఓన్లీ ఫలావ్ ను మాత్రమే ఇష్టపడుతారట. ఇది రోజూ మెనూలో ఉండే విధంగా చూసుకుంటారట.
రానా:
దగ్గుబాటి రానాకు మటన్ హలీమ్ అంటే చాలా ఇష్టమట. ఇది అందుబాటులో ఉన్నప్పుడు రోజూ తింటారని సమాచారం. అలాగే హైదరాబాద్ బిర్యానీని విడిచిపెట్టకుంటా తింటారట.

జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ కు ఏ ఆహారం ఇష్టమో దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న సమయంలో ఆయన కంటెస్టెంట్లకు మటన్ హలీమ్ వండి మరీ పెట్టాడు. తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు.. అవసరమైతే సొంతంగా తయారు చేసుకొని తింటారట.
రామ్ చరణ్:
మెగాపవర్ స్టార్ హీరో రామ్ చరణ్ చాలా సాష్ట్ ఫుడ్ తీసుకుంటారు. అన్నం, పప్పు, అప్పడం, పెరుగు, ఐస్ క్రీం లాంటివి మాత్రమే తీసుకుంటారు. అయితే నాన్ వెజ్ గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇలా చాలా మంది స్టార్లు డైట్ మెయింటేన్ చేస్తూనే తమ ఇష్టమైన ఆహారాన్ని అప్పుడప్పుడు ఇష్టంగా లాగించేస్తారు. అయితే ఎంత తీసుకున్నా వాటిని సమపాళ్లలో ఉంచుకునేందుకు ఎక్సర్సైజ్ లు చేస్తూ ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తారు.