Dishti: నర దిష్టికి నల్ల రాయి కూడా పగులుతుందంటా… ఈ దిష్టి అనేది అనాదిగా వస్తుంది. సైన్స్, టెక్నాలజీ ఎంత పెరిగినా.. మన పూర్వీకుల నుంచి ఇప్పటికీ దిష్టిని చాలా మంది నమ్ముతారు. చదువుకున్నవారు కూడా ఒంట్లో కాస్త సుస్తిగా ఉన్నా దిష్టి తాకిందని భావిస్తారు. చిన్న పిల్లల విషయంలో ఎక్కువగా దీనిని పాటిస్తారు. దిష్టి తగిలిందని భావిస్తే వెంటనే దిష్టితీసి రోడ్డుపై పడేస్తుంటారు. ఇందుకోసం నిమ్మకాయలు, కోడిగుడ్లు, ఎండు లేదా పచ్చి మిరపకాయలు.. ఇలా రకరకాల సామగ్రి వాడుతుంటారు. కూడళ్లలో ఇప్పటికీ ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇక వామనాలకు అయితే పూజ చేసిన సమయంలో వీటిని కడతారు. ఇళ్లకు, దుకాణాలకు, వ్యాపార సముదాయాలకు కూడా దిష్టి తగలకుండా కొన్ని వస్తువులు కడతారు. కొన్నాళ్లకు వాటిని కూడా తీసి కూడళ్లలో పడేస్తారు. అయితే రోడ్డుపైన పడి ఉన్న వాటిని తొక్కినా ఏమీ కాదని హేతువాదులు చెప్తుంటారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు అయితే అలాంటి వాటిలోని నిమ్మకాయలను జూస్ చేసుకుని తాగుతారు. కోడిగుడ్లను ఆమ్లెట్ వేసుకుని తిని చూసించారు. కొందరు మాత్రం వాటికి దూరంగా ఉండాలంటున్నారు. దాటడం, తొక్కడం చేయకూడదని చెబుతుంటారు.
జోతిష్యులు ఇలా..
జోతిష్య పండితులు కథనం ప్రకారం.. సహజంగా దృష్టి నుండి తగిలే దోషం ఉంటుందంటారు. దానినే దిష్టి అంటామని చెబుతారు. అలా దృష్టి దోషం ఉన్నప్పుడు అది పోవటం కోసం ఉప్పు తిప్పి వేయటం, నిమ్మకాయలు తిప్పి వేయటం, మిరపకాయలు తిప్పి వేయటం వంటివి చేయాలని సూచిస్తారు. అయితే పూర్వంలో వాటిని కట్టెల పొయ్యిల్లో, నిపుపలపై వేసేవారు. నాడు పొయ్యిలు ఆరుబయట ఉండేవి కాబట్టి.. వాటిని పొయ్యిల్లో వేసి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకునేవారు. నేడు ఆ సదుపాయం లేదు. అందరి ఇళ్లలో గ్యాస్ పొయ్యిలే. దీంతో ఇప్పుడు రోడ్లపై, కూడళ్లలో పడేస్తున్నారు.
తొక్కినా.. దాటినా నెగెటివ్ ఫలితాలు..
ఇలా దిష్టితీసి పడేసిన వాటిని తొక్కినా.. దాటినా నెగెటివ్ ఫలితాలు కలుగుతాయని జోతిష్యులు చెబుతుంటారు. చాలా మంది నెగటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.
దూరంగా ఉండడం మంచిది..
వాస్తవంగా చెప్పాలంటే రోడ్డుపై పడేసిన దేనిని ముట్టుకోకూడదు. రోడ్డుపై పడి ఉన్న వెంట్రుకలను ఎప్పుడు దాటి వెళ్లకూడదు. వాటిని తాక కూడదు. రోడ్డు మీద వెంట్రుకలను దాటి వెళితే అది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. రోడ్డుపై పడి ఉన్న నిమ్మకాయలు, మిరపకాయలను చూస్తే వాటిని తొక్కకుండా ఉంటేనే మంచిది. ఇక వాటిని తొక్కినా ప్రతికూల ఫలితాలు కలుగుతాయని కొందరు బలంగా విశ్వసిస్తారు. పూజా సామగ్రి కానీ ఆహారం కానీ రోడ్డు పక్కన లేదా చెట్టు కింద పడి ఉంటే దానిని కూడా తాకకూడదని చెబుతున్నారు. అయితే దిష్టి తీసి పడేసిన గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ తొక్కినా అనుమానం పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.