Unknown facts : తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా వారు మనల్ని అనుకరించి తప్పుడు దారిలో నడుస్తుంటారు. అందుకే చిన్న పిల్లల ఎదుట కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఒకవేళ మనం అలా చేస్తే వారికి కూడా అవే అలవాట్లు వస్తాయి. వారు కూడా జీవితంలో గొడవలకే ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వారి ముందు మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే అది వారి జీవితంపై మన ప్రభావం పడుతోందని తెలుసుకోవాలి. అలాంటి అలవాట్లు మనం మార్చుకుంటేనే మంచిది.
క్రమశిక్షణ రాహిత్యం ఎంత మాత్రం పనికి రాదు. మనం చెప్పే విషయాలకు చేసే పనులకు పొంతన ఉండాలి. అప్పుడే మన మీద గౌరవం ఏర్పడుతుంది. మనం చెప్పేదానికి చేసే దానికి సంబంధం లేకపోతే పిల్లలు అదే దారిలో ప్రయాణించే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తించడం వద్దు. అది పిల్లల మార్గానికి కూడా ప్రధాన కర్తవ్యంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పే క్రమంలో మంచి విషయాలపైనే వారికి ఆసక్తి ఉండేలా చూడాలి.
అబద్ధాలు ఆడకూడదు. మనం చెప్పే చిన్న చిన్న అబద్ధాలు పసివారి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. వాటిని అనుకరించి జీవితంలో ఎన్నో తప్పులు చేసేందుకు మార్గం వేసినట్లు అవుతుంది. అందుకే మనం చిన్న పిల్లల ముందు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడటం మంచిది కాదు. అవి వారికి అలవాటుగా మారితే కష్టమే. జీవితంలో ఇక ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడి తప్పించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే వారి ముందు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేయకూడదని తెలుసుకుంటే మంచిది.
పొరపాటున కూడా తప్పుడు పదాలు ఉపయోగించకూడదు. మనం మాట్లాడే మాటలు వారికి ఆయుధాలుగా మారుతాయి. ఆగ్రహంతో మనం అసభ్య పదజాలం వాడితే వాటిని పిల్లలు పట్టేస్తారు. వారు కూడా వాటిని ఉపయోగించేందుకే ఇష్టపడతారు. పిల్లలు ఉన్న సమయంలో మనం ఎలాంటి అసభ్య పదజాలాన్ని వాడకుండా ఉండేందుకే జాగ్రత్తలు తీసుకోవాలి. పాడు మాటలు మాట్లాడితే అది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది.
పిల్లల ముందు భార్యాభర్తలు ఎప్పుడు గొడవలకు దిగరాదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటే పిల్లలు వారి మాటలను అనుకరించే వీలుంటుంది. అందుకే పిల్లల ముందు ఎప్పుడు కూడా రభస సృష్టించడం మామూలు విషయం కాదు. వారు లేని సమయంలోనే అలాంటి వాటికి సిద్ధపడాలి కానీ వారి ముందు చేస్తే ఇక అంతే సంగతి. వారు మన మాటల్ని అలవాటు చేసుకుని గొడవలకు సిద్ధపడుతుంటారు .పిల్లల ముందు అత్యంత జాగ్రత్తగా ఉండటమే మంచి అలవాటు.
పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తించకూడదు. ముట్టుకోవడాలు, పట్టుకోవడాలు చేయకూడదు. పిల్లల ముందు కొందరైతే ముద్దులు పెట్టుకోవడం చూస్తుంటాం. అలాంటివి చేస్తే పిల్లలకు అలవాటుగా మారే అవకాశాలుంటాయి. దీంతో పిల్లలు చెడు భావాలతో ఇతర మార్గాల్లోకి వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి తల్లిదండ్రులు పిల్లలున్న సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి వారిని చెడు అలవాట్ల వైపు మళ్లకుండా చూసుకునే బాధ్యత వారిపైనే ఉంది.