Bappi Lahiri Gold: బాలీవుడ్ లో ప్రముఖ స్వరకర్తగా పేరుగాంచిన బప్పీలహరి మంగళవారం మరణించారు.ఆయన వయసు 69 సవంత్సరాలు. ఎన్నో సినిమాలకు తనదైన స్వరాలతో అలరించిన ఆయన అన్ని భాషల్లో పరిచయం ఉంది. తెలుగులో కూడా పలు చిత్రాలకు సంగతం అందించారు. అందులో గ్యాంగ్ లీడర్, ఖైదీ ఇన్స్ స్పెక్టర్, రౌడీఅల్లుడు, రౌడీగారి పెళ్లాం లాంటి సినిమాలు ఉన్నాయి. బప్పీలహరి సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. అలా ఆయన స్వరపరచిన గీతాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. కేవలం ఆయన సంగీతంతోనే సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఒక్కో పాటకు భారీ పారితోషికం తీసుకునే వారు. పాటకు రూ.10 లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. అలా ఆయన ఆదాయం భారీగా పెరిగింది. దీంతో ఆయన మనసు బంగారం వైపు మళ్లింది. దీంతో బంగారు ఆభరణాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన మెడలో కూడా ఎప్పుడూ బంగారు ఆభరణాలు కనిపించేవి. దీంతో ఆయనను గోల్డ్ మ్యాన్ గా పిలిచేవారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆయన బంగారంతో దగదగలాడేవారు. దీంతో ఆయన కంటే ఆయన బంగారమే ఫేమస్ అయింది.
రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. బీజేపీ టికెట్ పై పశ్చిమబెంగాల్ లోని సీరం నుంచి ఎంపీగా గెలిచి ప్రజాసేవలో కూడా తరించారు. సంగీతంతో పాటు బంగారంపై ఆయనకు మక్కువ ఏర్పడింది. దీంతో బంగారం కొనుగోలుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎక్కడకు వెళ్లినా బంగారంతో మెరిసిపోయేవారు. అందరు ఆయనకంటే ఆయన మీద ఉన్న బంగారాన్ని ఎక్కువగా చూసేవారు. బంగారం అంటే బప్పీలహరికి ఎంత ఇష్టమో ఆయనను చూస్తే తెలిసేది.
Also Read: Bappi Lahiri: విషాదం : ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
బంగారు ఆభరణాలను చూసుకోవడానికి ఓ సహాయకుడు కూడా ఉండేవాడు. అతడిని కేవలం బంగారు నగల కోసమే నియమించుకున్నారు. దీంతో ఎప్పుడు కూడా వాటిని శుభ్రం చేస్తూ మళ్లీ షోకేజ్ లో పెట్టడమే అతని విధి. దీంతో బంగారంపై బప్పీలహరికి క్రమంగా ప్రేమ పెరుగుతూ వచ్చింది. దీంతోనే ఆయన తన కుటుంబానికి బంగారానికే ఎక్కువ విలువ ఇచ్చేవారని చెబుతారు. ఎంత సంపాదించినా ఏమున్నది సర్వం వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని అందరు చర్చించుకుంటున్నారు.
ఆయన సంపాదించిన నగలను భద్రంగా కాపాడుతూ చూసుకుంటామని ఆయన కుమారుడు, కుమార్తె చెబుతున్నారు. భవిష్యత్ తరాలకు కూడా ఆయన నగలు కనిపించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంటున్నారు. తమ తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.
Also Read: Bappi Lahiri songs for Megastar: మెగాస్టార్ కెరీర్ మలుపు తిప్పిన బప్పిలహరి సాంగ్స్ ఇవే..