https://oktelugu.com/

Actor Ali: అలీకి జగన్ ఇవ్వబోతున్న పదవి అదేనట ?

Actor Ali: తెలుగు తెర పై కమెడియన్ గా అలీకి మంచి గుర్తింపు ఉంది. పైగా అలీ చేసిన సేవ పై కూడా చాలామందికి గౌరవం ఉంది. అందుకే.. అలీ అనగానే పాజిటివ్ పర్సన్ అనే టాక్ ఉంది. ఇక అలీ కూడా ఎప్పటి నుంచో రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఆశ పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత పదిహేను ఏళ్ల నుంచి తెలుగు దేశం తరఫున పని చేశాడు. సహజంగా వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీ చేసిన చంద్రబాబు.. […]

Written By:
  • Shiva
  • , Updated On : February 17, 2022 / 11:19 AM IST
    Follow us on

    Actor Ali: తెలుగు తెర పై కమెడియన్ గా అలీకి మంచి గుర్తింపు ఉంది. పైగా అలీ చేసిన సేవ పై కూడా చాలామందికి గౌరవం ఉంది. అందుకే.. అలీ అనగానే పాజిటివ్ పర్సన్ అనే టాక్ ఉంది. ఇక అలీ కూడా ఎప్పటి నుంచో రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఆశ పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత పదిహేను ఏళ్ల నుంచి తెలుగు దేశం తరఫున పని చేశాడు.

    Comedian Ali With Jagan

    సహజంగా వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీ చేసిన చంద్రబాబు.. మొత్తానికి అలీని ఎలా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటూ ముందుకు పోయారు. కానీ, రాజకీయాల్లో మాత్రం అలీకి ఏ విధంగా ఉపయోగ పడలేదు. అందుకే.. గత ఎన్నికల్లో అలీ సైలెంట్ గా జగన్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జగన్ కూడా అలీకి అన్ని రకాలుగా హామీలు ఇచ్చాడు.

    Also Read:   ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే!

    మొత్తమ్మీద జగన్ గెలిచాడు. గత వారం ఆలీకి కబురు పెట్టాడు. ఇక అప్పటి నుంచీ ఆలీకి రాజ్యసభ సీటు దక్కనుందని మీడియాలో పుకార్లు షికారు చేశాయి. నిజానికి జగన్ పార్టీలోకి అలీ వెళ్లే సమయంలోనే.. మీకు రాజ్యసభ పదవి గ్యారంటీ అంటూ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. మరి మాట ఇచ్చినట్టు.. జగన్, ఆలీకి రాజ్యసభ పదవి ఇస్తారా ? లేక వేరే ఏదైనా పదివి ఇస్తారా ? అనేది చూడాలి.

    Comedian Ali With Jagan

    ప్ర‌స్తుతానికి ఆలీకి కూడా స‌స్పెన్స్‌ గానే ఉంది పరిస్థితి. ఏది ఏమైనా జగన్ పై తనకు పూర్తి నమ్మకం ఉంది అని.. అందుకే.. తీపి కబురు కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ అలీ తన సన్నిహితుల దగ్గర ఓపెన్ అయ్యారట. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీ పార్టీకి అలీ చాలా బాగా ప్రచారం చేశారు. జగన్ పార్టీ విజయానికి అలీ తన వంతు కష్టాన్ని సమర్ధవంతంగా పడ్డారు.

    అందుకే, ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అలీకి ఫోన్ చేసి మాట్లాడారు. అయితే.. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. అలీకి రాజ్యసభ ఎంపీ పదవి గానీ, లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి గానీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలాగూ నటుడిగా పెద్ద అవకాశాలు ఏమి లేవు అలీకి. కాకపోతే బుల్లితెరపై మాత్రం హోస్ట్ గా బిజీగా ఉన్నాడు.

    Also Read:  ‘హేయ్ సినామికా’ అంటూ ట్రైలర్ వదిలిన మహేష్ బాబు !

    Tags