Puri Jagannath’s wife: టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ డ్యాషింగ్ డైరెక్టర్ మనుసు దోచింది ‘లావణ్య’. ఈ తరం జనరేషన్ లో అత్యంత స్పీడుగా, యాక్టివ్ గా సినిమాలు తీసే దర్శకుడు పూరి జగన్నాథ్.. చిన్న,పెద్ద హీరోలతో కూడా పూరి జగన్నాథ్ సినిమాలు తీశాడు. ఎంత పెద్ద హీరో అయినా సరే కేవలం రెండు నెలల్లోనే సూపర్ హిట్ సినిమాలు తీసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం.
ఇక పూరి జగన్నాథ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన భార్య పేరు లావణ్య. ఈమెను చూసి ప్రపోజ్ చేసి మరీ పూరి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆకాష్, ఒక కుమార్తె కూడా ఉంది. ఆకాష్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు.
పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఓ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చిన లావణ్యను తొలిచూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక తన భర్త ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా లావణ్య ఎప్పుడూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. అంతేకాదు.. పూరి జగన్నాథ్ కష్టసుఖాల్లో ఎప్పుడూ ఆమె పాలుపంచుకునేది.
Also Read: ఆ సీనియర్ హీరోయిన్ పెళ్లి బాజాలు మోగనున్నాయా ?
తాాగా ప్రముఖ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో లావణ్య టాలీవుడ్ హీరోలతోపాటు వాళ్ల ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని ఆమె చాలా గొప్పగా చెప్పారు. రవితేజ మా ఫ్యామిలీకి ఆప్తుడని.. మా ఇంట్లో కింద కూర్చుండి మరీ మాతో కలిసిపోతాడని తెలిపింది. బన్నీ అక్కా అని పిలుస్తాడని.. మహేష్ తో కలిసి పార్టీల్లో కలుస్తామని తెలిపారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ తనకు అక్క అవుతారని లావణ్య తెలిపారు. మెగా స్టార్ తన ఫేవరెట్ హీరో అని.. ఆయన ఎక్కడ కనపడినా తాను ‘బావ’ అని పిలుచుకుంటా అంటూ లావణ్య తన అభిమానాన్ని చాటుకుంది.
Also Read: బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసిన ‘రౌడీ బాయ్స్’ ఓటీటీలో హిట్ అవుతారా ?