Adavi Shesh Sunny Leon: అందరూ వెళ్లే దారిలో వెళితే విజయాలు దక్కవు. కొత్త దారిలో వెళితేనే విజయాలు.. ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు యంగ్ హీరో అడివి శేష్ కూడా అలానే వెళుతున్నాడు. అద్భుతమైన విజయాలు దక్కించుకుంటున్నాడు.

‘క్షణం’, గూఢచారి, ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. వినూత్నమైన ఈ కథలతో హిట్ కొట్టి శేష్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాలో నటించాడు. ఈ సినిమా జూన్ 3న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అడివి శేష్ ‘అలీతో సరదాగా’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నాడు. బాహుబలిలో తాను నటించిన పాత్రకు తల్లి ఎవరో రాజమౌళికి కూడా తెలియదని సదరాగా చెప్పుకొచ్చాడు. అనంతరం కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నాడు.
నిజానికి అడవి శేష్ పేరు ఇది కాదు.. తన పేరు ‘అడివి సన్నీ చంద్ర’. అయితే తన పేరు మార్చుకోవడానికి సన్నీలియోన్ కారణంగా చెప్పాడు శేష్. కాలేజీ చదివే రోజుల్లో ‘సన్నీలియోన్’ బాగా ఫేమస్ కావడంతో తన ఫ్రెండ్స్ అందరూ తనను ‘సన్నీ లియోన్’ అని ఏడిపించేవారట.. దీంతో సన్నీ బాధ పడలేక తన పేరును ‘అడవి శేష్’ గా మార్చుకున్నట్టుగా తెలిపాడు. సన్నీలియోన్ వల్ల ఏకంగా అడవి శేష్ పేరుమార్చుకున్న వైనం వైరల్ గా మారింది. వీళ్లిద్దరికీ ఎలాంటి రిలేషన్ లేకున్నా సన్నీ బ్యాక్ గ్రౌండ్ దెబ్బకు ఇలా ‘శేష్’ గా మారిపోవాల్సి వచ్చింది.
హైదరాబాద్ లో పుట్టిన శేష్ అమెరికాలో పెరిగాడు. అక్కడ భారతీయ నటులు హాలీవుడ్ సినిమాలలో చిన్న పాత్రలకే పరిమితమవ్వడాన్ని గమనించాడు. అందువల్ల అక్కడ సినిమాలో నటించడం కష్టం అని భావించి ఇండియాకు తిరిగి వచ్చాడు. తెలుగు సినిమాల్లో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా వినూత్న సినిమాలతో రాణిస్తున్నాడు.
[…] Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి … […]
[…] Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి … […]
[…] Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి … […]
[…] Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి … […]