Ring Watches: చేతికి కొన్ని ఆర్నమెంట్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అందం పెరుగుతుంది. ఇక వాచ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. టైమ్ చూడడానికి వాచ్ పెట్టుకునేవారు కొందరు అయితే కొంచెం రిచ్ లుక్ వచ్చేలా, స్టైల్ కోసం పెట్టుకునే వారు ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు సమయం చూడడానికి పెట్టుకునే వారు. కానీ మొబైల్స్ వచ్చాక వాటి అవసరం చాలా తగ్గింది. ఇక స్మార్ట్ వాచ్ లు వచ్చాక మరోసారి వాచ్ లు రాజ్యమేలుతున్నాయి. దీనికి అప్డేట్ గా ప్రస్తుతం రింగ్ వాచ్ లు వచ్చాయండోయ్.. ఓ సారి వాటి గురించి తెలుసుకుందామా?
మీరు ఎవరికి అయినా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా? దాని కోసం రిస్ట్ వాచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? కాస్త అప్డేట్ గా రింగ్ వాచ్ ఇచ్చేయండి. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. కొత్తగా ఉంటుంది కూడా. వేలికి తొడుక్కోవడానికి వీలుగా ఉండే ఈ వాచ్ లు చాలా స్టైలిష్ లుక్ ను స్తాయి. వీటిని చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. వీటిని ఎక్కడ కొనుగోలు చేయవచ్చు అనుకుంటున్నారా? ఈ కామర్స్ సైట్లు ఉన్నాయి కదా. అందులో ఈజీగా మీరు కొనుగోలు చేయవచ్చు. జస్ట్ గూగుల్ లో రింగ్ వాచ్ అని టైప్ చేయండి చాలు.
వీటి ఖరీదు కూడా చాలా తక్కువేనండోయ్. కొన్ని కంపెనీలు ఏకంగా రూ. 500 కంటే తక్కువే అమ్ముతున్నారు. రూ. 200కు పైగా రూ. 500కు తక్కువగానే ఉన్నాయి. మరి ఓ సారి సెర్చ్ చేసేయండి. ఇవి మగ, ఆడవారికి అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఎక్కువ వెరైటీలు కూడా ఉన్నాయి. అన్నీ పరిశీలించి తీసుకోండి. వీటికి కూడా వారంటీ ఉందండోయ్. కొన్నింటికి మూడు నెలలు ఉంటే మరికొన్నింటికి ఆరు నెలల వారంటీ లభిస్తోంది. ఇవి బ్యాటరీ సహాయంతో నడుస్తాయి. ఆ తర్వాత బ్యాటరీ కూడా చేంజ్ చేసుకోవచ్చు.
ఈ వాచ్ లు అన్ని వేళ్లకు సెట్ అయ్యేలా సైజ్ ను పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి వీలుగా తయారు చేశారు. కొన్ని వాచ్ లు అల్లాయ్ మెటీరియల్ తో తయారు చేశారట. సో.. త్వరగా పాడు కావు. వేసుకునే డ్రెస్ ను బట్టి కలర్స్ ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో వాటర్ ప్రూఫ్ లు కూడా ఉన్నాయి. నీరు పడినా, చెమట పడినా ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటికి అయితే టైమ్ ను మాత్రమే చూపిస్తున్నాయి. మరి కొన్ని రోజులు అయితే స్మార్ట్ రింగ్ వాచ్ లు కూడా అందుబాటులోకి వస్తాయి కావచ్చు.