
Vinaro Bhagyamu Vishnu Katha Collections: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాళ్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి విజయలతో టాలీవుడ్ కి గ్రాండ్ సక్సెస్ లు మొదలయ్యాయి.అయితే ఆ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను రాబట్టలేకపోయాయి. దీనితో మళ్ళీ టాలీవుడ్ కి కష్టకాలం మొదలైందని అనుకుంటున్న సమయం లో రీసెంట్ గా విడుదలైన ధనుష్ ‘సార్’ మరియు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సినిమాలు పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని టాలీవుడ్ ని మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చాయి. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.
ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకి పలు ప్రాంతాలలో నిన్ననే ప్రీమియర్ షోస్ వేశారు. అక్కడి నుండే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమాకి మొదటి రోజు మార్నింగ్ షోస్ నుండే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు ఎంత వసూళ్లు రాబోతున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ నాలుగు కోట్ల రూపాయిలకు జరిగిందట. మొదటి రోజు మార్నింగ్ షోస్ నుండే టాక్ అదిరిపోవడం తో కేవలం నైజాం ప్రాంతం నుండే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, మరియు కోటి రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టబోతుందని సమాచారం.

ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి చూసుకుంటే ఈ సినిమాకి మొదటి రోజే రెండు కోట్ల 20 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది అన్నమాట. సరైన హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న కిరణ్ అబ్బవరం కి మొత్తానికి పెద్ద బ్లాక్ బస్టర్ తగిలిందనే చెప్పాలి.ఇదే ఫ్లో ని మొదటి వారం మొత్తం కొనసాగిస్తే ఫుల్ రన్ లో కచ్చితంగా 10 కోట్ల రూపాయిలకు పైగానే షేర్ వసూళ్లను సాధిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
