సుకన్య సమృద్ధి స్కీమ్ లో డబ్బులు పెడితే కలిగే లాభాలు తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఆలోచనతో కేంద్రం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఆడపిల్లలకు ఉన్నత విద్య, పెళ్లి సమయంలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ తోడ్పాటును అందిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఇచ్చే స్కీమ్ కావడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు సైతం ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేక పొదుపు పథకమైన సుకన్య సమృద్ధి స్కీమ్ ను కేంద్రం 2015లో […]

Written By: Kusuma Aggunna, Updated On : October 7, 2020 9:40 am
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఆలోచనతో కేంద్రం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఆడపిల్లలకు ఉన్నత విద్య, పెళ్లి సమయంలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ తోడ్పాటును అందిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఇచ్చే స్కీమ్ కావడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు సైతం ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు.

ప్రత్యేక పొదుపు పథకమైన సుకన్య సమృద్ధి స్కీమ్ ను కేంద్రం 2015లో ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఆడపిల్ల పుట్టిన తరువాత పది సంవత్సరాల లోపు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. భారతీయ పౌరురాలై ఉన్నవారు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందగలుగుతారు.

తల్లిదండ్రులు ఇద్దరు ఆడపిల్లలకు రెండు ఖాతాలను తెరవవచ్చు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే మూడో ఖాతా తెరిచేందుకు అనుమతులు ఇస్తారు. మొదటిసారి ముగ్గురు ఆడపిల్లలు జన్మించినా లేదా రెండోసారి ఇద్దరు ఆడపిల్లలు జన్మించినా ముడో ఖాతా తెరవడానికి అనుమతులు ఇస్తారు. ఈ స్కీమ్ లో 250 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు పొదుపు చేయవచ్చు.

ఖాతా తెరిచిన రోజు నుంచి 14 సంవత్సరాల పాటు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ కు 8.4 శాతం వడ్డీరేటు లభిస్తుంది. సంవత్సరానికి 1000 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 46,800 రూపాయలు పొందవచ్చు. సంవత్సరానికి 1,50,000 రూపాయలు జమ చేస్తే 21 సంవత్సరాల తర్వాత 70,20,000 రూపాయలు సొంతమవుతాయి.