https://oktelugu.com/

Nagashaurya- Anusha Shetty: నాగశౌర్య భార్య అనూష శెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోతారు

Nagashaurya- Anusha Shetty: యూత్ ని ఆకట్టుకునే కథనలతో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో నాగ శౌర్య.. ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం ద్వారా ఒక మంచి సూపర్ హిట్ తో ఇండస్ట్రీ కి పరిచయమైనా నాగశౌర్య కెరీర్ లో ఆ తర్వాత రెండు మూడు హిట్లు తప్ప మిగిలిన ఎక్కువ శాతం ఫ్లాప్స్ గా నిలిచాయి.. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఆయన తన పెళ్లి గురించి ఆకాశమత్తుగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 21, 2022 / 08:10 AM IST
    Follow us on

    Nagashaurya- Anusha Shetty: యూత్ ని ఆకట్టుకునే కథనలతో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో నాగ శౌర్య.. ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం ద్వారా ఒక మంచి సూపర్ హిట్ తో ఇండస్ట్రీ కి పరిచయమైనా నాగశౌర్య కెరీర్ లో ఆ తర్వాత రెండు మూడు హిట్లు తప్ప మిగిలిన ఎక్కువ శాతం ఫ్లాప్స్ గా నిలిచాయి.. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఆయన తన పెళ్లి గురించి ఆకాశమత్తుగా ఒక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.. నిన్న బెంగళూరు లో బంధుమిత్రుల సమక్షం లో వేద మంత్రాల సాక్షిగా నాగ శౌర్యా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

    Nagashaurya- Anusha Shetty

    బెంగళూరు కి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని ఆయన ప్రేమించి పెళ్ళాడ్డారు.. ఈ పెళ్ళికి టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీస్ పెద్దగా హాజరుకాలేదు.. కేవలం కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు మాత్రమే ఆహ్వానం దక్కింది..మరి హైదరాబాద్ లో జరగబోయ్యే రిసెప్షన్ కి అయినా ఇండస్ట్రీ కి సంబంధించిన వారిని పిలిస్తాడో లేదో చూడాలి.

    ఇక అనూష శెట్టి బ్యాక్ గ్రౌండ్ వివరాల్లోకి వెళ్తే ఈమె బెంగళూరు లో బాగా పేరుమోసిన ఇంటీరియర్ డిజైనర్..అక్కడ ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ని ప్రారంభించి తన సరికొత్త లేటెస్ట్ డెజైన్స్ తో అతి తక్కువ సమయంలోనే ఈమె టాప్ మోస్ట్ డెజైనర్ గా పేరు ప్రాఖ్యాతలు సంపాదించింది.. టాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ కి సంబందించిన ఎంతో మంది స్టార్ హీరోలు ఈమె ఇచ్చిన ఇంటీరియర్ డెజైన్స్ తోనే తమ భవనాలను నిర్మించుకున్నారు.

    Nagashaurya- Anusha Shetty

    బెంగళూరు లో కొంతకాలం గడిపిన నాగ శౌర్యా కి అనూష తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఇంటి పెద్దలను ఒప్పించి నిన్న ఘానంగా వీళ్లిద్దరి వివాహం జరిపించుకున్నారు..ఇక నాగ శౌర్య విషయానికి వస్తే ఇటీవలే ఈయన తన సొంత నిర్మాణ సంస్థలో తీసిన ‘కృష్ణా వృందా విహారి ‘ అనే సినిమాలు ద్వారా సూపర్ హిట్ ని తన ఖాతాలో లో వేసుకున్నాడు.. చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ కావడం తో నాగ శౌర్యా తన తదుపరి సినిమాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు.. ప్రస్తుతం ఆయన ‘ఫలాన అబ్బాయి ఫలాన అమ్మాయి ‘,’నారి నారి నడుమమురారీ’,’పోలీసు వారి హెచ్చరిక’ వంటి సినిమాలు చేస్తున్నాడు.. ఈ సినిమాల స్క్రిప్ట్స్ చాలా చక్కగా వచ్చాయని.. తన కెరీర్ ని మలుపు తిప్పుతుందని నాగ శౌర్య పలు ఇంటర్వూస్ లో తెలిపాడు.



    Tags