Souls Are Hell: మానవ సమాజంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ప్రశ్నలలో ఒక దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మనిషి చనిపోయాక ఏమవుతాడు.. ఆత్మ అతని శరీరం నుంచి నిజంగానే వెళ్లి పోతుందా.. ఇలాంటి అనేక ప్రశ్నలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కాగా వీటి గురించి గరుడ పురాణంలో చాలా క్లియర్ గా చెప్పారు. మనిషి చనిపోయాక ఆత్మ ఏమౌతుంది అనే విషయంపై కూలంకుషంగా వివరించారు.

ఈ గరుడ పురాణం చెబుతున్నదాని ప్రకారం.. మనిషి చనిపోయే కొన్ని నిమిషాల ముందు వారికి సర్వస్వం కనిపిస్తుందట. ఆ క్షణంలో వారికి ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. దాంతో వారు ప్రపంచాన్ని మొత్తం అర్థం చేసుకోగలుగుతారు. మరికొద్ది సేపట్లో ప్రాణాలు పోతాయి అనగా అతనికి నల్లని రూపంలో యమదూతలు కనిపిస్తారట. వారికి తల సరైన ఆకారంలో ఉండదు. ప్రాణాలు పోయిన వెంటనే ఆత్మను తీసుకుని యమదూతలు ఆకాశం వైపు ప్రయాణమవుతారు.
Also Read: BJP Focus On Uttarandhra: ఉత్తరాంధ్రపై బీజేపీ ఫోకస్.. సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన కాషాయ దళం
యమలోకం వైపు ఆత్మను తీసుకుని వెళుతున్న క్రమంలో చిత్రహింసలు పెడతారట యమదూతలు. తమను చూసి భయపడినా లేదంటే మధ్యలో ఆగిపోయినా నానా హింసలు పెడతారట. ఇలా వెళుతున్న సమయంలోనే యమలోకంలో విధించే శిక్షల గురించి ఆత్మలకు వివరిస్తారట యమదూతలు. ఆ శిక్షల గురించి తెలుసుకుని ఆత్మలు ఏడుస్తాయి. తమని యమలోకం తీసుకెళ్లవద్దని వేడుకున్నా సరే కనికరించకుండా లాక్కెలతాయి యమదూతలు.

నరకానికి వెళ్లిన తర్వాత వారు చేసిన తప్పులను బట్టి యమధర్మరాజు శిక్షలు విధిస్తాడు. చిన్న చిన్న తప్పులు చేసి దైవ ప్రార్థన చేసిన వారికి పెద్దగా శిక్షలు విధించడు. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టినా లేదంటే హత్యలు చేసిన వారికి మాత్రం కఠినంగా శిక్షలు ఉంటాయట. ఇక ఆత్మను ఒకసారి తన వాళ్లను చూసి రమ్మని యమధర్మరాజు భూలోకానికి పంపిస్తాడు. అలా వచ్చిన ఆత్మ తన వాళ్లను చూసుకొని తిరిగి వెళ్లిపోతుంది. అయితే మనిషి చనిపోయిన పది రోజుల లోపు హిందూ శాస్త్రం ప్రకారం కర్మకాండలు నిర్వహిస్తే.. భూలోకానికి వచ్చిన ఆత్మ సంతోషంగా తిరిగి వెళ్ళి పోతుందట. ఒకవేళ నిర్వహించకపోతే మాత్రం ఇక్కడ చెట్లపై పక్షుల రూపంలో తిరుగుతుందట.
Also Read:BP Sugar in Telangana: తెలంగాణ ప్రజలకు బీపీ, షుగర్ పెరగడానికి కారణాలేంటి?