Dry Grapes Benefits: మనకు డ్రై ఫ్రూట్స్ లో కిస్ మిస్ లు ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో దీనికి మంచి ప్రాధాన్యం ఉంది. ఆరోగ్య పరిరక్షణలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అనేక రోగాలకు ఇవి మందులా పనిచేస్తాయి. సహజంగా మనం తీసుకునే ఆహారంలో కిస్ మిస్ లు ఉంచుకోవడం శ్రేయస్కరం. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. లవణాలు, విటమిన్లు శరీరానికి అందుతాయి. డ్రైఫ్రూట్స్ లో మనకు లాభం చేకూర్చే అంశాలే ఎక్కువగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. అనేక అనారోగ్యాలకు ఎండుద్రాక్ష మందులా వినియోగించడం సహజమే.

ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల దంత సమస్యలు రావు. చిగుళ్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. వాత, పిత్త దోషాలు ఉన్న వారికి కూడా ఎండు ద్రాక్ష ప్రయోజనం కలిగిస్తుంది. మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరుకి దోహదపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేని వారికి ఎండుద్రాక్ష ఎన్నో లాభాలు కలిగిస్తుంది.
ఎండు ద్రాక్ష తినడంతో సంతాన సాఫల్యం పెరుగుతుంది. మెదడుకు చురుకుదనం తెస్తాయి. ఏకాగ్రత దెబ్బతినకుండా సాయపడతాయి. దీంతో వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. ఇందులో పొటాషియం, కెటెచిన్లు, విటమిన్ సి పుష్కలంగా అందుతాయి. దీంతో ఆర్థరైటిస్ తో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి. ఇవి రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఆకలి వేసినప్పుడు స్నాక్స్ కంటే వీటిని తినడం మంచిది.

ఇందులో పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం, డయేరియాను నిరోధిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. ఇలా ఎండు ద్రాక్ష మన శరీరానికి ఎన్నో లాభాలు కలిగిస్తుంది. ఆరోగ్య సంరక్షణలో తోడ్పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే ఎంతో కాపాడతాయి. ఎండు ద్రాక్షతో మనకు ఆరోగ్య ఫలాలు అందుతాయి. ఈ నేపథ్యంలో ఎండు ద్రాక్ష వినియోగంతో మనకు ఎన్నో రకాల వ్యాధులు రాకుండా చేస్తుందని తెలుసుకుంటే మంచిది.