https://oktelugu.com/

Comedian Raghu : అన్నం కూడా తినలేని పరిస్థితి నుండి కోట్ల రూపాయలకు పడగలెత్తిన కమెడియన్ రఘు నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు

Comedian Raghu : ఇండస్ట్రీలో కొంతమంది కమెడియన్స్ ఎన్ని సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు.కామెడీ బాగానే చేస్తున్నాడే, ఎందుకు ఇతను అందరిలా సక్సెస్ కాలేకపోయాడు అని మనకి అనిపించినా కమెడియన్స్ చాలా మంది ఉన్నారు.వారిలో ఒకరు రఘు కారుమంచి. ఇతగాడు ఇప్పటి వరకు సుమారుగా 150 చిత్రాలలో కమెడియన్ గా నటించాడు, నటుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ బాగానే సుపరిచితమైనప్పటికీ, ఎందుకో అతనికి ఉన్న కామెడీ టైమింగ్ కి ఇంకా వేరే లెవెల్లో ఉండాల్సింది అనే […]

Written By: , Updated On : March 7, 2023 / 10:11 PM IST
Follow us on

Comedian Raghu : ఇండస్ట్రీలో కొంతమంది కమెడియన్స్ ఎన్ని సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు.కామెడీ బాగానే చేస్తున్నాడే, ఎందుకు ఇతను అందరిలా సక్సెస్ కాలేకపోయాడు అని మనకి అనిపించినా కమెడియన్స్ చాలా మంది ఉన్నారు.వారిలో ఒకరు రఘు కారుమంచి. ఇతగాడు ఇప్పటి వరకు సుమారుగా 150 చిత్రాలలో కమెడియన్ గా నటించాడు, నటుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ బాగానే సుపరిచితమైనప్పటికీ, ఎందుకో అతనికి ఉన్న కామెడీ టైమింగ్ కి ఇంకా వేరే లెవెల్లో ఉండాల్సింది అనే అభిప్రాయం చాలామందిలో ఉన్నది.

అంతకు ముందు అడపాదడపా సినిమాల్లో ఆఫర్స్ వస్తూ ఉండేవి కానీ,మధ్యలో ఏమైందో అకస్మాత్తుగా సినిమాల్లో అవకాశాలు రావడం ఆగిపోయాయి.ఆ సమయం లోనే ఆయనకీ ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనాల్సిందిగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుండి ఆహ్వానం దక్కింది.రాకరాక వచ్చిన అవకాశం కావడంతో వెంటనే ఒప్పుకొని ఆ షో లో ఒక కంటెస్టెంట్ పాల్గొనే అవకాశం దక్కింది.

వచ్చిన అతితక్కువ సమయం లోనే జబర్దస్త్ లో ఒక టీం లీడ్ చేసే రేంజ్ కి ఎదిగిన రఘు, అదే ఫామ్ ని కొనసాగించలేక పొయ్యాడు.దీనితో జబర్దస్త్ యాజమాన్యం ఆయనని షో నుండి తప్పించేసింది.ఇక కరోనా మహమ్మారి అందరి జీవితాలను కుదిపేసినట్టే రఘు జీవితం లో కూడా చీకటిని నింపింది.ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురైన రఘుకి కనీసం తినడానికి కూడా త్రింది దొరకని పరిస్థితులను కూడా ఎదురుకున్నాను అంటూ ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.అయితే స్నేహితుల ప్రోత్సాహం తో ఒక బ్రాందీ షాప్ లో పని చేసానని, కానీ ఆ తర్వాత రెండు నుండి మూడు బ్రాందీ షాప్స్ కి ఓనర్ అయ్యే రేంజ్ కి వచ్చాడు.

ప్రస్తుతం ఆయన సంపాదన నెలకి లక్షల్లనే ఉంటుందట,రీసెంట్ గా ఆయన కట్టుకున్న ఇల్లు ని కూడా చూపించాడు.ఆ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.ఈ ఇల్లు విలువ సుమారు గా 20 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట.ఇంత కాస్ట్ లీ ఇల్లు కొంతమంది హీరోలకైనా ఉంటుందో లేదో అని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Comedian Jabardasth Raghu Started New Business | Wine Shop | Telangana | TV5 News Digital