Rishab Shetty Remuneration: కాంతార… మూవీ ఆఫ్ ది డికేడ్ అనొచ్చు. కథ, కథనం, వసూళ్లు… పరిగణలోకి తీసుకొని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజమౌళి లాంటి దర్శకుడు కాంతార మూవీ అద్భుతం అన్నారు. ఆయన ఆలోచనలు మార్చేసిన చిత్రంగా అభివర్ణించారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో లేకుండా కోట్లు కొల్లగొట్టవచ్చని కాంతార నిరూపించింది. కాబట్టి మేము ఆత్మపరిశీలన చేసుకోవాలన్న అభిప్రాయం రాజమౌళి వెలిబుచ్చారు. మరి పెట్టుబడికి 20 రెట్లకు పైగా వసూళ్లు కాంతార సాధించింది.

కెజిఎఫ్ నిర్మాతలు కాంతార చిత్రాన్ని కేవలం రూ. 16 కోట్లతో నిర్మించారు. వరల్డ్ వైడ్ ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. బడ్జెట్ తో పోల్చుకుంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ 10000 వేల కోట్ల వసూళ్లు సాధించిన దాంతో సమానం. అందుకే రాజమౌళి కాంతార నా థింకింగ్ మార్చేసింది అన్నారు. ఈ మధ్య కాలంలో కాంతార ఇచ్చినంత లాభం డిస్ట్రిబ్యూటర్స్ కి మరో చిత్రం ఇవ్వలేదు. తెలుగులో కాంతార విడుదల హక్కులు కేవలం రూ. 2 కోట్లకు కొన్నారు. 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
విడుదలైన అన్ని భాషల్లో కాంతార ప్రభంజనం సృష్టించింది. లాభాల పరంగా చూస్తే కెజిఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాల కంటే కాంతార పెద్ద హిట్. ఈ వెండితెర అద్భుతం వెనకున్న వ్యక్తి రిషబ్ శెట్టి అని మనకు తెలుసు. హీరోగా, దర్శకుడిగా, రచయితగా రిషబ్ శెట్టి అన్నీ తానై నడిపారు. ఇండియన్ సినిమా వర్గాలు మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేశారు.

కన్నడ పరిశ్రమకు ప్రశాంత్ నీల్ తర్వాత గుర్తింపు తెచ్చిన దర్శకుడిగా రిషబ్ శెట్టి రికార్డులకు ఎక్కారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్ల జేబులు నింపిన రిషబ్ శెట్టి కాంతార చిత్రానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు అందుతున్న సమాచారం షాక్ ఇస్తుంది. కారణం… అంత తక్కువ మొత్తం రిషబ్ శెట్టికి కాంతార చిత్రానికి దక్కింది. మొదట రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ రూ. 5.5 కోట్లు అనుకున్నారట. ఒప్పందం ప్రకారం అది ఇచ్చేశారు. సినిమా సక్సెస్ నేపథ్యంలో మరో రూ. 5 కోట్లు ఇచ్చారట. అలా కేవలం రూ. 10.5 కోట్లు కాంతార చిత్ర రెమ్యూనరేషన్ గా రిషబ్ శెట్టి అందుకున్నారట.