https://oktelugu.com/

Shekhar Master Remuneration : శేఖర్ మాస్టర్ ఒక్కో పాటకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ప్రభుదేవా మాస్టర్ కి కూడా ఇంత ఇవ్వరేమో!

Shekhar Master Remuneration : ప్రస్తుతం ఇండియా లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో శేఖర్ మాస్టర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది.స్టార్ హీరోల దగ్గర నుండి, సీనియర్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికీ శేఖర్ మాస్టర్ కావాలి.ఈయన రేంజ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు, కోలీవుడ్ ,శాండిల్ వుడ్ మరియు బాలీవుడ్ కి ఈయన సుపరిచితమే. ప్రస్తుతం ఆయన రేంజ్ చూస్తూ ఉంటే అప్పట్లో ప్రభుదేవా మరియు లారెన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 07:42 PM IST
    Follow us on

    Shekhar Master Remuneration : ప్రస్తుతం ఇండియా లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో శేఖర్ మాస్టర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది.స్టార్ హీరోల దగ్గర నుండి, సీనియర్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికీ శేఖర్ మాస్టర్ కావాలి.ఈయన రేంజ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు, కోలీవుడ్ ,శాండిల్ వుడ్ మరియు బాలీవుడ్ కి ఈయన సుపరిచితమే.

    ప్రస్తుతం ఆయన రేంజ్ చూస్తూ ఉంటే అప్పట్లో ప్రభుదేవా మరియు లారెన్స్ కి ఎలాంటి ఇండియా వైడ్ డ్యాన్స్ మాస్టర్స్ గా ఎలాంటి క్రేజ్ ఉండేదో, ఈయనకి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉందని అర్థం అవుతుంది.ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను అవమానాలను ఎదురుకున్నాడు.రాకేష్ మాస్టర్ శిష్యుడిగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ ని సంపాదించిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత చిన్నగా సినిమా అవకాశాలను సంపాదిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు స్థాయికి చేరుకున్నాడు.

    అయితే శేఖర్ మాస్టర్ ఒక్కో పాటకి తీసుకునే రెమ్యూనరేషన్ 5 నుండి 10 లక్షల రూపాయిల వరకు ఉంటుందట.అంటే ఒక సినిమాకి మొత్తం కొరియోగ్రఫీ చేస్తే 30 నుండి 40 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ వస్తుందన్నమాట.శేఖర్ మాస్టర్ ఏడాదికి కనీసం 12 నుండి 15 సినిమాల వరకు చేస్తాడు.అవన్నీ లెక్కగడితే ఏడాదికి ఆయన సంపాదన 4 నుండి 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.

    దీనితో పాటు ఆయన బుల్లితెర పై పలు కామెడీ షోస్ కి మరియు డ్యాన్స్ షోస్ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉంటాడు.వాటి ద్వారా కూడా ఈయన బాగానే సంపాదిస్తున్నాడు.ఇక ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ,అలాగే నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాల్లోని అన్నీ పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.ప్రస్తుతం పుష్ప సినిమాకి కూడా ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నాడు.