Singer Sunitha Husband Ram Properties: సింగర్ సునీతకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను. సునీత రూపం, కట్టు బొట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆమెను జనాలు అభిమానించడంలో అది కూడా ఒక కారణం. కెరీర్లో సక్సెస్ అయినప్పటికీ సునీత వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యారు. ఆమె చిన్న వయసులోనే ప్రేమలో పడ్డారు. 17 ఏళ్లకు పరిశ్రమకు వచ్చిన సునీత 19 ఏళ్లకు ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్లకే పిల్లలు, సంసారం చకచకా జరిగిపోయాయి. అయితే భర్త ప్రవర్తన సునీత జీవితాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఒక దశలో సునీత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సునీత భర్త నుండి విడాకులు తీసుకున్నారు. చాలా కాలంగా సునీత పిల్లలతో పాటు పేరెంట్స్ తో ఒంటరిగా ఉంటున్నారు. 2020లో ఆమె జీవితం కీలక మలుపు తీసుకుంది. ఆమె మంచి మనసుకు రామ్ రూపంలో అదృష్టం చేరువైంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న రామ్ వీరపనేనితో సునీతకు చాలా కాలంగా పరిచయం ఉంది. రామ్ సైతం ఒంటరి జీవితం గడుపుతున్నారు. సునీత అంటే ఆయనకు ఇష్టం. ఎట్టకేలకు లాక్ డౌన్ సమయంలో రామ్ మనసులో కోరిక బయటపెట్టారు. ఫోన్లో మీకు ఇష్టం అయితే వివాహం చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు.
మళ్ళీ పెళ్లి అనేది అతి పెద్ద నిర్ణయం. అందుకే ఆలోచించి, పేరెంట్స్ తో చర్చించి చెబుతానని సునీత అన్నారట. పిల్లలు, కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం సునీత 42 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. సునీత పెళ్లి వార్త మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పిల్లలతో పాటు తన భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నా నిర్ణయాన్ని గౌరవించి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను, అని సునీత వివరణ ఇచ్చారు.

2021 జనవరిలో రామ్-సునీత వివాహం జరిగింది. ఈ సంఘటన సునీత జీవితాన్ని పూర్తిగా మార్చేసింది, వెలుగులు నిపించింది. ప్రస్తుతం సునీత చీకు చింతా లేని హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇక రామ్ వీరపనేనికి ఉన్న ఆస్తుల చిట్టా తెలిస్తే మైండ్ పోతుంది. ఆయనకు ఫార్మ్ హౌస్ లు ఉన్నాయి. జంట నగరాల్లో అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పలు కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. తండ్రి నుండి వారసత్వంగా వందల కోట్ల ఆస్థి సంక్రమించింది. రియల్ ఎస్టేట్, మీడియా వ్యాపారాల్లో ఉన్న రామ్ సంపద వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చు, అంటున్నారు.