
Charan Reddy: కొంతమంది సినీ తారలు అతి చిన్న వయస్సులోనే చనిపోవడం అనేది ఎన్నో ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నాము.అది కూడా తీవ్రమైన ఒత్తిడి భరించలేక గుండెపోటు తో చనిపోయిన సందర్భాలను ఈమధ్య కాలం లో కూడా చాలానే చూసాము.అయితే మన చిన్నతనం లో ‘ఇష్టం’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమై ఆ తర్వాత ఇండస్ట్రీ లో కనిపించకుండాపోయిన చరణ్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము.
చరణ్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని బుచ్చి రెడ్డి పాలెం కి చెందిన కుర్రాడు.ఇతను రామోజీ రావు అప్పుడు కొత్తవాళ్ళని పెట్టి నిర్మించబోతున్న ‘ఇష్టం’ అనే సినిమా కోసం ఆడిషన్స్ లో చేస్తూ చరణ్ రెడ్డి ని ఎంచుకున్నాడు.ఈ సినిమా ద్వారానే ప్రముఖ హీరోయిన్ శ్రీయ శరన్ మరియు ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ లు కూడా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు.
ఈ చిత్రం కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ హీరో చరణ్ రెడ్డి కి మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే కొన్నాళ్ళకు ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు అక్కినేని సుప్రియ ని ప్రేమించి పెళ్లాడాడు.ఈమె పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం లో హీరోయిన్ గా నటించింది..ఈ సినిమా తర్వాత ఎందుకో మళ్ళీ ఆమె సినిమాల్లోకి రాలేదు..అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను స్వీకరించి అలాగే కెరీర్ ని కొనసాగిస్తుంది.

చరణ్ రెడ్డి తో పెళ్ళైన తర్వాత కొద్దిరోజులు వీళ్లిద్దరి మధ్య దాంపత్య జీవితం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్య తరుచూ ప్రతీ విషయం లో మనస్పర్థలు ఎదురవుతూ ఉండేవట.చనిపొయ్యే ఒక ఏడాది కి ముందు చరణ్ రెడ్డి విడాకుల కోసం కోర్టులో పిటిషన్ కూడా వేసాడు.సుప్రియా గొడవలు పడినప్పుడల్లా ఇతను ముందుకి బానిస అయ్యేవాడట.అలా ఆమెతో గొడవల వత్తిడి తట్టుకోలేక మద్యానికి బానిసై తన ప్రాణాలకే ముప్పు తెచుకున్నాడని అప్పట్లో డాక్టర్లు కూడా ఒక సంచలన రిపోర్టు ని విడుదల చేసారు.
అలా ఈ యువ హీరో జీవితం కేవలం 36 ఏళ్లకే ముగిసిపోయింది.ఇక అతను చనిపోయిన తర్వాత సుప్రియ మరో పెళ్లి చేసుకోలేదు.సింగల్ గానే ఉంటుంది, అయితే ఈమె ప్రస్తుతం యువ హీరో అడవి శేష్ తో గత కొంతకాలం నుండి ప్రేమాయణం నడుపుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి.వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ప్రైవేట్ పార్టీలకు హాజరవ్వడం, వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.మరి రాబొయ్యే రోజుల్లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి.