https://oktelugu.com/

Allu Arjun Pushpa: పుష్ప షూటింగ్ లో అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో చూడండి…

Allu Arjun Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప -2’తో బిజీగా ఉన్నాడు. సుక్కు డైరెక్షన్లో వస్తున్న ఈమూవీ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజింగ్’ అంచనాలకు మించి విజయం సాధించింది. పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే పుష్ప ది రైజింగ్ కూడా ఉంటుందని డైరెక్టర్ ముందే చెప్పాడు. అంతేకాకుండా పార్ట్ వన్ 1లో ఉత్కంఠ బరిత ట్విస్ట్ ఇచ్చి సస్పెన్స్ పెట్టాడు. దీంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఈగర్ గా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 7, 2023 / 11:26 AM IST
    Follow us on

    Allu Arjun Pushpa

    Allu Arjun Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప -2’తో బిజీగా ఉన్నాడు. సుక్కు డైరెక్షన్లో వస్తున్న ఈమూవీ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజింగ్’ అంచనాలకు మించి విజయం సాధించింది. పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే పుష్ప ది రైజింగ్ కూడా ఉంటుందని డైరెక్టర్ ముందే చెప్పాడు. అంతేకాకుండా పార్ట్ వన్ 1లో ఉత్కంఠ బరిత ట్విస్ట్ ఇచ్చి సస్పెన్స్ పెట్టాడు. దీంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 1 వచ్చి రెండేళ్లు అవుతోంది. పార్ట్ 2 షూటింగ్ కు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రావడం లేదు. అప్పుడప్పుడు బన్నీ పిక్స్ తప్ప మరే సమాచాం లీక్ కావవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ‘పుష్ప ఎక్కడ?’ అనే యాష్ ట్యాగ్ తో సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ పిక్ హాట్ టాపిక్ గా మారింది.

    లేటేస్టుగా గా అల్లు అర్జున్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దట్టమైన అడవిలో పుష్ప చిన్న మంట పెట్టుకొని కనిపించాడు. ఇందులో బన్నీ షూటింగ్ కోసం బాగా కష్టపడినట్లు కనిపిస్తోంది. బన్నితో పాటు ఇతర నటులు కూడా ఆయనతో ఉన్నారు. చాలా మంది పుష్ప ఎక్కడ? అని పోస్టులు పెడుతుండగా.. ‘పుష్ప ఇలా ఇక్కడ..’ అంటూ రిప్లై ఇస్తున్నారు. పార్ట్ 1 కు సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 కూడా అడవిలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో కొన్ని సీన్లు మినహా చాలా భాగం ఫారెస్ట్ కనిపిస్తుంది.

    Allu Arjun Pushpa

    ఇక పార్ట్ 2లో పుష్ప కోటీశ్వరుడు అవుతాడని తన సామ్రజ్యాన్ని సృష్టించుకుంటాడని అంటున్నారు. ఆ నేపథ్యంలోనే మూవీ సాగుతుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి బన్నీ లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఇందులో పార్ట్ 1 లో నటించిన వారే మళ్లీ ఉంటారా? లేక కొత్తవారిని చేరుస్తారా? అన్న చర్చ సాగుతోంది. ఇక హీరోయిన్ రష్మిక మందానా హాట్ హాట్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్ వన్ లో బన్నీకి పోటీగా రష్మిక యాక్టింగ్ తో అదరగొట్టింది. అటు అందాలను ఆరబోసి యూత్ ను ఇంప్రెస్ చేసింది.

    ఇదిలా ఉండగా సినిమా ఎప్పుడెప్పుడా? అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. పార్ట్ వన్ లో థ్రియేటికల్ సస్పెన్స్ ను ఉంచిన సుక్కు పార్ట్ 2లో ఏవిధంగా చూపిస్తారోనని అంతా చర్చించుకుంటున్నారు. ఇక పార్ట్ 1లో చివరి సీన్ కు కంటిన్యూగా చేరుస్తారా? లేక కొత్త కథను రూపొందిస్తారా? అని అనుకుంటున్నారు ఏదీ ఏమైనా ఇండస్ట్రీలో పుష్ప 2 పై హాట్ టాపిక్ నడుస్తోంది.