Special Temple: దేవాలయానికి వెళ్లాలంటే సూర్యోదయానికంటే ముందే లేస్తాం. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల లోపే గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాం. ఆలయాలు సైతం ఉదయం 3 గంటల నుంచే ప్రారంభం అవుతాయి. కానీ ఇక్కడున్న ఓ దేవాలయంలోకి వెళ్లాలంటే మాత్రం మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. ఉదయం మొత్తం నీళ్లలో మునిగి ఉన్న ఆ ఆలయం మధ్యామ్నం అయితే గానీ కనిపించదు. దీంతో ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారు నేరుగా మధ్యాహ్నం వస్తున్నారు. ఆలయం గురించి తెలియని వారు ఉదయం వచ్చినా.. మధ్యాహ్నం వరకు వేచి ఉండి.. ఆ తరువాత దేవుడిని దర్శించుకుంటున్నారు. ఇంతకీ ఈ వింత ఆలయం ఎక్కడుందో తెలుసా?
మహా శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. మనం శివాలయం వెళ్లినప్పుడు ఆ దేవునికి అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అయితే ఇక్కడి శివుడు నిత్యం అభిషేకం పొందుతాడు. నిత్యం అభిషేకంలో మునిగే శివాలయాన్ని చూడాలంటే గుజరాత్ కు వెళ్లాల్సిందే. ఈ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గర్లో కొలియాక్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామ సమీపంలో అరేబియా సముద్రం ఉంది. ఈ సముద్రంలో ఒడ్డు నుంచి కొద్దిదూరంలో లోపలి ప్రాంతంలోని ఈ శివాలయంలో మహాశివుడికి పూజలు చేసేందుకు భక్తులు అక్కడికి తరలివెళ్తుంటారు. అయతే వీరంతా మధ్యాహ్నం వెళ్తారు.
ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ ఆలయం సముద్రపు నీటితో కప్పబడుతుంది. మధ్యాహ్నం కాగానే సముద్రపు నీరు వెనక్కి వెళ్తుంది. దీంతో ఆలయం ప్రత్యక్షమవుతుంది. అలా మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆలయం కనిపిస్తుంది. ఆ తరువాత మళ్లీ నీళ్లు పైకి రావడంతో ఆలయం నీటిలోకి వెళ్తుంది. ఈ ఆలయం చూడడానికి వెళ్లాల్సి వస్తే మద్యాహ్నం దర్శించుకొని సాయంత్రం లోపు తిరిగి రావాలి. లేకుండే నీళ్లు కప్పేస్తాయి.
ఇక్కడున్న ఆలయం ముందు ఓ ధ్వజస్తంభం ఉంది. ఇది 20 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయంల నీళ్లలోకి వెళ్లినప్పుడు ధ్వజస్తంభం మాత్రం కనిపిస్తుంది. ఇక్కడి మహాదేవుడిని దర్శించుకునేందుకు ధ్వజస్తంభంను చూస్తూ ఉంటారు. క్రమంగా నీరు వెళ్లగానే భక్తులు అక్కడికి పయనవుతారు. ఇక పున్నమి రాత్రి రోజున ఇక్కడ మరింత ఎక్కువగా నీరు వస్తుంది. ఇలా కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతుండడంతో కొందరు పర్యాటకులు ప్రత్యేకంగా వచ్చి దర్శించుకుంటున్నారు.