While Getting New SIM : కొత్త సిమ్ తీసుకునేటప్పుడు ఆధార్ తో పాటు వేలిముద్ర ఇస్తున్నారా..? అయితే వెంటనే ఇది చదవండి.. 

ఇందుకోసం మొబైల్ లోని ప్లే స్టేర్ నుంచి M Aadhar అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులో Aadhar Card డిటేల్ష్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తరువాత యాప్ ఓపెన్ అవుతుంది.  ఆ తరువాత లాక్ బయోమెట్రిక్ సిస్టమ్ అనే ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవాలి.

Written By: Srinivas, Updated On : July 21, 2023 4:11 pm
Follow us on

While Getting New SIM : ఈరోజుల్లో ప్రతి దానికి ఆధార్ కార్డు ఐడెంటిటీగా పనిచేస్తుంది. ఆధార్ నెంబర్ చెబితే చాలు.. మన వివరాలన్నీ కంప్యూటర్లో డిస్ ప్లే అయిపోతాయి. బ్యాంకు నుంచి ఇతర కార్యకలపాలన్నింటిలో ఆధార్ తప్పని సరి అయింది. లేటేస్టుగా ఏదైనా దరఖాస్తు చేసుకోవడానికి పేపర్ లెస్ మెయింటేన్ చేస్తున్నారు. అంటే ఎలాటి జిరాక్స్, ఇతర ధ్రువపత్రాలు అవసరం లేకుండా వేలిమద్రలతో మన వివరాలన్నీ సేకరిస్తున్నారు. ముఖ్యంగా మనం కొత్త సిమ్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డును ఫొటో తీసుకుంటారు. ఆ తరువాత వేలి ముద్ర వేయమంటారు. అయితే ఇలా చేయడం తప్పనిసరి.. కానీ అంతకంటే ముందే మీరు ఓ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేంటో తెలుసుకుందాం…
రవి అనే ఓ యువకుడు కొత్త సిమ్ తీసుకోవాలని అనుకున్నాడు. దీంతో ఓ కంపెనీకి చెందిన షోరూంకు వెళ్లాడు.  అయితే అంతకుముందే ఐడెంటిటీ కోసం ఆధార్ జిరాక్స్ ఫొటో పట్టుకెళ్లాడు. కానీ కరోనా తరువాత పేపర్ లెస్ వర్క్ చేస్తున్నట్లు షో రూం ప్రతినిధి చెప్పాడు. దీంతో అవేమీ అవసరం లేదని ఒక ఆధార్ కార్డు ఒరిజినల్ మాత్రం ఇవ్వండి.. అని అడిగారు. ఆ తరువాత అతని వేలిముద్ర తీసుకున్నాడు. 20 నిమిషాల పాటు ప్రాసెస్ చేసిన తరువాత రవికి కొత్త సిమ్ ఇచ్చాడు. ఇంటికి వచ్చిన రవికి మొబైల్ కు ఓ మేసెజ్ వచ్చింది. తన బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఆ తరువాత ఎంక్వైరీల తేలిన విషయమేంటంటే కొందరు వేలిముద్రల ద్వారా మన బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేస్తున్నారని. రవికి సంబంధించి.. అతని వేలిముద్ర తీసుకున్నారు. అలాగే ఆధార్ కార్డు డిటేయిల్స్ తీసుకున్నారు. దీంతో ఓటీపీతో సంబంధం లేకుండా అతని బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేశారు.  ఇందులో రవి చేసిన తప్పేమీ లేదు. అలాగని సిమ్ కార్డులు ఇచ్చే వాళ్లను నిందించడం కాదు. కానీ అంతకంటే ముందే ఓ చిన్న ప్రాసెస్ చేయాలి.
Aeps (Aadhar Enabled Payment System)  అనే సిస్టమ్ ద్వారా ఇటువంటి మోసాల నుంచి రక్షించుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ లోని ప్లే స్టేర్ నుంచి M Aadhar అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులో Aadhar Card డిటేల్ష్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తరువాత యాప్ ఓపెన్ అవుతుంది.  ఆ తరువాత లాక్ బయోమెట్రిక్ సిస్టమ్ అనే ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవాలి. అయితే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్లీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా హ్యాకింగ్  నుంచి తప్పించుకోవచ్చు.