Photo Story : ‘భజరంగి బాయిజాన్’ మున్నిని ఇప్పుడు చూస్తే మెంటలెక్కుతుంది.. 

మున్ని పాత్రలో నటించిన అమ్మాయి పేరు హర్షాలీ మల్హోత్రా. భజరంగి బాయి 2015లో థియేటర్లోకి వచ్చింది. ఆ సమయంలో హర్షాలీ వయసు 7 సంవత్సరాలు. చిన్నప్పుడే స్కూలుకెళ్తే ఈ సినిమాలో నటించిన ఆమెకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది.

Written By: Chai Muchhata, Updated On : July 31, 2023 1:12 pm
Follow us on

Photo Story : కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినీ కెరీర్లో వచ్చిన ది బెస్ట్ మూవీ ‘భజరంగి బాయిజాన్’. పాకిస్తాన్ కు చెందిన ఓ అమ్మాయి ఇండియాలో తప్పిపోతే పరిస్థితి ఏంటీ? అనే కోణంలో దీనిని కబీర్ ఖాన్ తీర్చిదిద్దారు. మొదట్లో ఈ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ స్టోరీ చూశాక థియేటర్లు పరుగులు పెట్టారు. ఆ స్టోరీ అందించింది ఎవరో కాదు.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారే. పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అయిన ఈ మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని అనుకోవచ్చు. ఇందులో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దికీ, శరత్ సక్సెనా నటించారు. ఇందులో మున్ని అనే పాత్రలో ఓ అమ్మాయి ఆకట్టుకుంటుంది. ఆమె చుట్టే సినిమా తిరుగుతుంది.  మున్ని పాత్రలో నటించిన ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడెలా ఉంది?

మున్ని పాత్రలో నటించిన అమ్మాయి పేరు హర్షాలీ మల్హోత్రా. భజరంగి బాయి 2015లో థియేటర్లోకి వచ్చింది. ఆ సమయంలో హర్షాలీ వయసు 7 సంవత్సరాలు. చిన్నప్పుడే స్కూలుకెళ్తే ఈ సినిమాలో నటించిన ఆమెకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన మూగ అమ్మాయిలా నటించిన ఈమె  2008 జూన్ 3న జన్మించింది. ఈ సినిమా కోసం ఓ పాప క్యారెక్టర్ కావాలని ఎదురుచూస్తున్న సమయంలో హర్షాలీని చూసి వీరు ఓకే చేశారు. వారికి అనుగుణంగానే హర్షాలీ ఆమె పాత్రలో లీనమైపోయింది.

ఈ సినిమా తరువాత హర్షాలీ మరే సినిమాలో నటించలేదు. చదువుపైనే ఫోకస్ పెట్టింది. అయితే లేటేస్ట్ గా ఆమెకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హర్షాలీకి ఇప్పుడు 15 సంవత్సరాలు. హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఆమెను చూసి చాలా మంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్ గా నటిస్తే తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే హర్షాలీ మాత్రం తాను ఇప్పుడే సినిమాల్లోకి వచ్చే ది లేదన్నట్లు మౌనం పాటిస్తోంది.
అయితే హర్షాలీకి సంగీతం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆమె డైలీ మ్యూజిక్ క్లాసులకు అటెంట్ అవుతోంది. ఈ క్రమంలో కొందరు ఆమెను చూసిన కెమెరాలో క్యాప్చర్ చేశారు.  ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నింగా అస్సలు ఒప్పుకోలేదు.  అయితే హర్సాలీ అప్పుడప్పుడు సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేస్తు ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఆకట్టుకున్న ఈమె హీరోయిన్ గా రాణిస్తే తప్పకుండా ఆదరిస్తారని అంటున్నారు.