Disha Patani: దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. అయితే ఆమె కెరీర్ మొదలైంది తెలుగులోనే. దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ గా ఆమెకు మొదటి ఛాన్స్ ఇచ్చాడు. లోఫర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా విడుదలైన లోఫర్ ఆడలేదు. అదే సమయంలో దిశా పటానికి బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి. దీంతో టాలీవుడ్ కి టాటా చెప్పేసింది. ప్రస్తుతం వరుసగా హిందీ చిత్రాలు చేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ కే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే లో దిశా పటాని సెకండ్ హీరోయిన్. దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో అమితాబ్ సైతం కీలక రోల్ చేస్తున్నారు. ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లోనే అత్యధిక బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. ఈ చిత్ర ప్రోమోలు, విశేషాలు అంతకంతకూ హైప్ పెంచేస్తున్నాయి. దిశా పటాని ప్రాజెక్ట్ కే చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది.

ప్రాజెక్ట్ కే తో పాటు మరో సౌత్ ప్రాజెక్ట్ కి ఆమె సైన్ చేశారు. ఓ తమిళ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. అలాగే సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రాశి ఖన్నా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

కాగా దిశా తరచుగా ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో ఉంటారు. హీరో టైగర్ ష్రాఫ్ తో ఆమె చాలా కాలం ఎఫైర్ నడిపారు. కారణం తెలియదు కానీ టైగర్ ష్రాఫ్ తో ఆమె విడిపోయారు. వెంటనే మరో తోడు వెతుక్కుంది. నటుడు, మోడల్ అలెక్సాండర్ అనే వ్యక్తితో ఈ భామ చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. ముంబైలో ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తున్నారు. డిన్నర్ నైట్స్, డేట్స్ అంటూ విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అలెక్సాండర్ తో జంటగా ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో దిశా హాట్ ఫోటో షూట్స్ బౌండరీలు బ్రేక్ చేస్తున్నాయి. తాజాగా బెడ్ పై పడుకొని ఒక్కొక్క వస్త్రం తీసేస్తూ… బోల్డ్ ఫోటో షేర్ చేశారు. దిశా తెగింపుకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇక బికినీలో జీరో సైజు బాడీ చూపిస్తూ ఫోటో షూట్స్ చేయడం దిశాకు ఇష్టమైన వ్యవహారం.