Bappi Lahari: ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పి లాహిరి (69) కన్నుమూశారు. తన డిస్కో సంగీతంతో జనాలను పిచ్చెక్కించిన బప్పి దాదా మంగళవారం రాత్రి 11 గంటలకు జుహులోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తన స్వరంతో పాటు బంగారు ఆభరణాలు ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు ఈ రాక్ స్టార్.
బప్పి దాదాకు గతేడాది కరోనా సోకింది. దీంతో అతడిని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు. కరోనాను జయించి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్ది రోజుల క్రితం మళ్లీ అతడికి కరోనా సోకింది. దీంతో. అతను క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బప్పి లహరి 1980 నుంచి 2000 వరకు తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించారు. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, ఉషా ఉతుప్, సురేష్ వాడ్కర్, సుదేశ్ భోంస్లే తదితర ప్రముఖ గాయకులు, సంగీతకారులతో కలిసి పనిచేశారు.
అమెరికన్ రాక్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీకి అభిమాని.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
తన డిస్కో మ్యూజిక్‌తో యువతను ఉర్రూత లూగించిన బప్పి, అలంకరణలోనూ ప్రత్యేకతను చాటుకున్నాడు. తన చేతులకు, వేళ్లకు బంగారు ఉంగరాలు, కంకణాలు ధరించేవాడు. బప్పి అమెరికన్ రాక్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీకి అభిమాని. ఎల్విస్ తన కచేరిల సమయాల్లో ఎప్పుడూ బంగారు చైన్లు ధరించేవారు. ఎల్విస్‌ని చూసి, బప్పి కూడా ఫాలో అయ్యాడు. తన అభిమాన సంగీత దర్శకుడిలా బప్పి కూడా విజయం సాధించాడు. దేశంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపున సంపాదించుకున్నాడు. బంగారంపై ఉన్న ఈ క్రేజ్ కారణంగా, అతన్ని గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
బప్పి రాక్, డిస్కో మ్యూజిక్ ఇప్పటికీ ఉర్రూతలూగిస్తున్నది. చిత్ర పరిశ్రమలో రెండు రకాల సంగీతాన్ని సమకూర్చిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడాడు. పలు రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపించాడు. డెబ్బైలలో వెండితెరపై ఆవిర్భవించిన బప్పి ఎనభైల వరకు ఆధిపత్యం చెలాయించాడు.
-మిథున్ చక్రవర్తి కెరీర్‌కు రూపం
2014లో బప్పి లహరి వద్ద రూ.4 లక్షల విలువైన 754 గ్రాముల బంగారం, 4.62 కిలోల వెండి, వజ్రాలు ఉన్నాయి. బప్పి లాగే అతని భార్య చిత్రాణి లహరికి కూడా బంగారం, వజ్రాలు అంటే చాలా ఇష్టం. బప్పి లాహరితోనే మిథున్ చక్రవర్తి కెరీర్‌ని ప్రారంభించాడు. అయామే డిస్కో డాన్సర్ పాట మిథున్ చక్రవర్తికి కెరీర్లోనే ది బెస్ట్ గా నిలిచింది. ఆ స్థాయి పాట మిథున్ కెరీర్ లో మళ్లీ రాలేదు. మిథున్ ను రాక్ స్టార్ గా అవతరింపజేసింది. ఇప్పటికీ ఆ పాటకు క్రేజ్ తగ్గలేదు. బప్పీకి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. చిన్నతనంలోనే తబలా వాయించడం నేర్చుకున్నాడు. బొంబయ్ సే ఆయా మేరా దోస్త్…, ఆయామే డిస్కో డాన్సర్ తదితర పాటలు ఎప్పుడూ ప్రజల నాలుకపై మెదులుతూనే ఉంటాయి
-శెనార్తి…
Also Read: షర్మిల అరెస్టుతో ఏం జరుగుతోంది?