https://oktelugu.com/

Naga Chaitanya-Dhanush Divorce: చైతూ-ధనుష్ విడాకులు..దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన తప్పేంటి?

Naga Chaitanya-Dhanush Divorce: నాగచైతన్య భార్య సమంతతో విడిపోవడానికి, రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ కి గుడ్ బై చెప్పడానికి శేఖర్ కమ్ముల కారణం అంటే మీరు నమ్ముతారా?. ఆ ఇద్దరినీ వెంటాడిన ఓ సెంటిమెంట్ పరిశీలిస్తే నిజమే అంటారు. శంకర్ కమ్ములతో సినిమా చేసినా ఏ హీరోకైనా విడాకులు తప్పవంటూ సోషల్ మీడియాలో ఓ వాదన బయలుదేరింది. దీంతో మీమర్స్, ట్రోలర్స్ శేఖర్ కమ్ములపై సెటైర్స్ వేస్తున్నారు. శేఖర్ కమ్ముల కెరీర్ పరిశీలిస్తే… […]

Written By:
  • Shiva
  • , Updated On : January 19, 2022 / 12:33 PM IST
    Follow us on

    Director Sekhar Kammula and Dhanush Divorce

    Naga Chaitanya-Dhanush Divorce: నాగచైతన్య భార్య సమంతతో విడిపోవడానికి, రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ కి గుడ్ బై చెప్పడానికి శేఖర్ కమ్ముల కారణం అంటే మీరు నమ్ముతారా?. ఆ ఇద్దరినీ వెంటాడిన ఓ సెంటిమెంట్ పరిశీలిస్తే నిజమే అంటారు. శంకర్ కమ్ములతో సినిమా చేసినా ఏ హీరోకైనా విడాకులు తప్పవంటూ సోషల్ మీడియాలో ఓ వాదన బయలుదేరింది. దీంతో మీమర్స్, ట్రోలర్స్ శేఖర్ కమ్ములపై సెటైర్స్ వేస్తున్నారు.

    Naga Chaitanya and Director Sekhar Kammula

    శేఖర్ కమ్ముల కెరీర్ పరిశీలిస్తే… ఇప్పటి వరకు ఆయన పెళ్లి కాని హీరోలతోనే సినిమాలు చేశారు. రానా లాంటి హీరోలు కొందరు ఆయనతో సినిమా చేశాక పెళ్లి చేసుకున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ముగ్గురు పెళ్ళైన హీరోలు మాత్రమే చిత్రాలు చేశారు. ఆ ముగ్గురు విడాకులు తీసుకున్నారు. ఇది హీరో సుమంత్ తో మొదలైంది. 2004లో సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2006లో ఆయన విడాకులు తీసుకొని కీర్తితో విడిపోయారు.

    సుమంత్ విడాకుల సమయంలో శేఖర్ కమ్ములతో గోదావరి మూవీ చేస్తున్నారు. గోదావరి మూవీ 2006లో విడుదలైన విషయం తెలిసిందే. గత ఏడాది నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ చేశాడు. శేఖర్ కమ్ముల-చైతూ కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం 2021లో విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడే సమంత-చైతూ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2021 అక్టోబర్ 2న ఇద్దరూ విడాకుల ప్రకటన చేశారు.

    Naga Chaitanya-Dhanush Divorce

    Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులకు ఆ ఇద్దరు హీరోయిన్లే కారణమా?

    తాజాగా ధనుష్ దర్శకుడు శేఖర్ కమ్ములతో మూవీ ప్రకటించారు. అది సెట్స్ పైకి కూడా వెళ్లినట్లు సమాచారం. సుమంత్, నాగచైతన్యల సెంటిమెంట్ కొనసాగుతూ… ధనుష్ సైతం విడాకులు ప్రకటించారు. శంకర్ కమ్ములతో ధనుష్ మూవీ ప్రకటించి ఆరు నెలలు అవుతుంది. ఇంతలోనే విడాకులకు రంగం సిద్ధమైంది. ఇదంతా గమనిస్తుంటే శేఖర్ కమ్ముల సెంటిమెంట్ నాగ చైతన్య, ధనుష్ తమ భార్యలతో విడిపోవడానికి కారణమైంది అంటున్నారు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిన దానికి పాపం శేఖర్ కమ్ములను బాధ్యుడిని చేయడం ఏమైనా బాగుందా…

    ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మీమ్స్ రాయుళ్లు ఈ సెంటిమెంట్ పై ఓ రేంజ్ లో ఫన్ జెనరేట్ చేస్తున్నారు. సదరు మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా ధనుష్-ఐశ్వర్య విడాకులకు హీరోగారి అఫైర్స్ నే కారణమన్న మాట వినిపిస్తుంది

    Also Read: ధనుష్ – ఐశ్వర్య విడాకులకు కారణం అదే !

    Tags