https://oktelugu.com/

Heroine Director Affair: టాలీవుడ్ లీక్స్: ఫేడవుట్ హీరోయిన్ తో పెళ్ళైన దర్శకుడి రాసలీలలు… ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్!

Heroine Director Affair: ఏదో సినిమాలో చెప్పినట్లు డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తేనే ఆన్ స్క్రీన్ లో హీరోతో అద్భుతమైన రొమాన్స్ సెట్ చేయగలడట. దర్శకులతో హీరోయిన్స్ యవ్వారాలు నడపడం కొత్తమీ కాదు. చాలా కాలంగా ఈ ట్రెండ్ ఉంది. తన సినిమాకు ఫలానా హీరోయిన్ కావాలని ఎంపిక చేసుకునే హక్కు దర్శకుడిదే. నిర్మాత, హీరో గుడ్డిగా ఆయన చెప్పిన అమ్మాయికి ఎస్ అంటారు. ఈ క్రమంలో దర్శకుడుకి నచ్చినట్లు ఉంటూ, […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2023 / 09:37 AM IST
    Follow us on

    Heroine Director Affair

    Heroine Director Affair: ఏదో సినిమాలో చెప్పినట్లు డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తేనే ఆన్ స్క్రీన్ లో హీరోతో అద్భుతమైన రొమాన్స్ సెట్ చేయగలడట. దర్శకులతో హీరోయిన్స్ యవ్వారాలు నడపడం కొత్తమీ కాదు. చాలా కాలంగా ఈ ట్రెండ్ ఉంది. తన సినిమాకు ఫలానా హీరోయిన్ కావాలని ఎంపిక చేసుకునే హక్కు దర్శకుడిదే. నిర్మాత, హీరో గుడ్డిగా ఆయన చెప్పిన అమ్మాయికి ఎస్ అంటారు. ఈ క్రమంలో దర్శకుడుకి నచ్చినట్లు ఉంటూ, చెప్పిన పని చేసే హీరోయిన్స్ కి విరివిగా అవకాశాలు వస్తుంటాయి.

    ఇక పలువురు హీరోయిన్స్ దర్శకులను ప్రేమించి పెళ్లాడారు. నయనతార, యామి గౌతమ్, సోనాలీ బింద్రే, రాణి ముఖర్జీ వీరందరూ దర్శకులతో లవ్ లో పడ్డోళ్లే. తమ బంధాన్ని పెళ్లితో పదిలం చేసుకున్నారు. నయనతార అయితే ఏకంగా ఏడేళ్లు ప్రేమాయణం నడిపింది. 2015లో నానుమ్ రౌడీదాన్ మూవీతో మొదలైన వీరి లవ్ స్టోరీ 2022లో జరిగిన పెళ్లితో సుఖాంతం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు కూడాను. పెళ్లైన నాలుగైదు నెలలకే సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అయ్యారు.

    ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఓ ఎఫైర్ హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లై పిల్లలున్న డైరెక్టర్ ఒక హీరోయిన్ మోజులో పడ్డాడట. ఈ దర్శకుడు ఎనిమిదేళ్ల కెరీర్లో ఐదారు సినిమాలు చేశాడు. తన మొదటి సినిమాతోనే సంచలనం చేశాడు. పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. అనూహ్యంగా ఇటీవల ఒక భారీ సక్సెస్ అందుకున్నాడు. అయితే నిలకడలేనితనం ఈ దర్శకుడిని ఇబ్బంది పెడుతుంది. కాగా ఈ దర్శకుడు ఒక హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడట. తరచుగా ఆమెతో నైట్ పార్టీలకు వెళుతున్నాడట. ఆ హీరోయిన్ తో దర్శకుడి ఎఫైర్ ముదిరింది అంటున్నారు.

    Heroine Director Affair

    పబ్స్, లగ్జరీ హోటల్స్ లో తరచుగా కనిపిస్తున్నారట. ఇండస్ట్రీకి సంబంధించిన పార్టీలకు కూడా ఆమెతో వెళుతున్నాడట. ఇక ఈ హీరోయిన్ విషయానికి వస్తే… ఆమె తెలుగులో సినిమా చేసి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. బాగా తెలిసిన ఫేసే కానీ కెరీర్లో అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె ఫేడ్ అవుట్ దశలో ఉన్నారు. ఆ దర్శకుడితో ఆమె ఒక్క సినిమాకు కూడా పని చేయలేదు. ఈ క్రమంలో ఇద్దరికీ ఎలా జతకుదిరిందనేది ఆసక్తికరంగా మారింది. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ మరొకరితో పరిచయాలు కలిగి ఉంటారు. అలా ఇద్దరూ ఒక్కటై ఉండవచ్చు. ఏది ఏమైనా ఫెడవుట్ హీరోయిన్ తో పెళ్ళైన దర్శకుడి వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది.

    Tags