
NTR 30 Story: సాధారణంగా సినిమా కథను, కథలోని ట్విస్ట్స్ విడుదల వరకు బయటకు రాకుండా టీమ్ జాగ్రత్త పడుతుంది. ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఉండదు. ప్రేక్షకులు ఆ థ్రిల్ మిస్ అవుతారు. అది సినిమా ఫలితం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అందుకే యూనిట్ నుండి సినిమా విశేషాలు బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటారు. దీనికి రాజమౌళి భిన్నం. ఆయన సినిమా ప్రకటన రోజే కథ మీద హింట్ ఇచ్చేస్తారు. లొకేషన్స్, సెట్స్, హీరోల లుక్స్ బయటకు రాకుండా చూసుకుంటారు. కథ మాత్రం చెప్పేస్తారు.
ఆర్ ఆర్ ఆర్ తో పాటు మహేష్ తో చేయబోయే చిత్రాల కథలు ఆయన ముందుగానే వెల్లడించారు. మహేష్ తో తెరకెక్కించే చిత్రం జంగిల్ అండ్ యాక్షన్ అడ్వెంచర్. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథగా ఇది ఉంటుందని చెప్పారు. కాగా రాజమౌళి స్టైల్ దర్శకుడు కొరటాల శివ ఫాలో అవుతున్నారని పిస్తుంది. ఎన్టీఆర్ 30 కథ ఏమిటో ఆయన సుచాయిగా చెప్పేశారు. హీరో, హీరోయిన్ పాత్రల మీద అవగాహన ఇచ్చారు. ఆయన మాటలు వింటుంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపిస్తుంది.
నేడు ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించారు. అనంతరం టీమ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా కథ ఇలా ఉంటుందని ఆయన వెల్లడించారు. భారతదేశ తీర ప్రాంతంలో అనేక కుట్రలు, కుతంత్రాలు చోటు చేసుకున్నాయి.అవే నా సినిమా ప్రధాన వృత్తాంతం. సాగరతీరంలో మనుషుల రూపంలో కొన్ని మృగాలు తిరుగుతూ ఉంటాయి. వాటి అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఒక వేటగాడు దిగుతాడు. రాక్షసుల కంటే దారుణమైన ఆ మృగాలను భయపెట్టే వాడే హీరో… అని చెప్పారు.

సినిమాలో సీరియస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదే సమయంలో చాలా ఎమోషనల్ గా సాగుతుంది. కథలో భావోద్వేగాలు కూడా ఉంటాయి. జాన్వీ కపూర్ రోల్ చాలా ప్రత్యేకం. కథలో కీలకమని కొరటాల శివ చెప్పారు. మొదటి నుండి ఇది సాగర తీరం ప్రధానంగా సాగే కథ అని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు కొరటాల శివ అదే చెప్పారు. కొరటాల మాటలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. రెగ్యులర్ షూట్ త్వరగా మొదలు కానుంది. 2024 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.