Homeఆంధ్రప్రదేశ్‌Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదం.. వైసీపీలో ఆటలో ‘గంటా’ అరటిపండు?

Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదం.. వైసీపీలో ఆటలో ‘గంటా’ అరటిపండు?

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao, Chandrababu- Jagan

Ganta Srinivasa Rao: ఏపీలో ఏ క్షణాన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడిందో కానీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పరిణామాలు, సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. పట్టభద్రుల స్థానాల్లో వైసీపీకి పట్టు తప్పేసరికి ఇక ఎన్నికలు ఏకపక్షంగా కావన్న విషయం తేలిపోయింది. విపక్షాల మధ్య ఐక్యత పెరగడం, వారంతా వైసీపీ ఓటమే కోరుతుండడంతో జగన్ లో కలవరపాటు ప్రారంభమైంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎన్నికలు కాక రేపుతున్నాయి. విజయానికి ఒకే ఒక ఓటు దూరంలో టీడీపీలో ఉండడం టెన్షన్ పెంచుతోంది. రెండు పార్టీలు రెబల్స్, క్రాస్ ఓటింగ్ పైనే ఆశ పెట్టకున్నాయి. అయితే టీడీపీని అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్న తరుణంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారన్న ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ వేదికగా జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది.

ప్రతీ ఓటు కీలకం కావడంతో..
ఎమ్మెల్యేల కోటా కింద ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. వైసీపీ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది. ఏడు స్థానాలకూ వైసీపీ పోటీ పెట్టింది. అంతా ఏకగ్రీవమవుతాయని భావించింది. కానీ టీడీపీ అనూహ్యంగా బీసీ మహిళా నేత పంచుమర్తి అనురాధను బరిలో దించింది. దీంతో పోటీ అనివార్యంగా మారింది. ప్రస్తుతం వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేనకు చెందిన రాపాక, టీడీపీకి చెందిన కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు అధికార పార్టీ నీడన చేరారు. దీంతో అధికార వైసీపీ బలం 156కు చేరింది. కానీ ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ధిక్కార స్వరం వినిపించారు. పార్టీకి దూరమయ్యారు. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 22 మంది ఎమ్మెల్యేలు చొప్పున వైసీపీ కరెక్టుగా 154 మంది ఉన్నారు. అటు ఆనం, కోటంరెడ్డిలు సపోర్టుచేసినా టీడీపీకి 21 మంది సభ్యుల బలం ఉంటుంది. మరొక ఎమ్మెల్యే మొగ్గుచూపితే మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతుంది.

ఇన్నాళ్ల తరువాత..
అయితే ఇటువంటి సమయంలోనే గంటా రాజీనామాను ఆమోదించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారలోకి రావడంతో ఆయన పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. బీజేపీ, వైసీపీలో చేరుతారని ప్రచారం సాగినా జరగలేదు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కానీ అది స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. గంటా ఇటీవల టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో గంటా రాజీనామాను యాక్సెప్ట్ చేసి టీడీపీని దెబ్బకొట్టాలని వైసీపీ భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

ఎటువంటి ప్రకటన చేయని స్పీకర్ ఆఫీస్..
ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగుతోంది. సీఎం జగన్ తో సహా 108 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. గంటా రాజీనామాపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. కానీ గంటా ఈ అంశం పై స్పందించారు. అదంతా అధికార పార్టీ మైండ్ గేమ్ గా అభివర్ణించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రతిపాదించిన వారిలో తానూ ఒకడినని.. ఎమ్మెల్యే ఓట్ల జాబితాలో తన పేరు ఉందన్నారు. ఇటువంటి సమయంలో రాజీనామా ఆమోదం పొందే చాన్సే లేదని తేల్చేశారు. తాను ఓటు వేయకుండా అడ్డుకోలేరంటూ వివరించారు. తాను స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసానని.. కానీ, ఇప్పుడు తన రాజీనామా ఆమోదిస్తే అంతకంటే వైసీపీ చేసే పెద్ద తప్పు మరొకటి ఉండదని చెప్పుకొచ్చారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం గంటా రాజీనామా ఆమోదం పైన స్పందించటం లేదు. దీనిపై ఏపీ వ్యాప్తంగా సస్పెన్స్ కొనసాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular