Homeఎంటర్టైన్మెంట్Director Harish Shankar: చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాం... డైరెక్టర్ హరీష్ శంకర్ షాకింగ్ కౌంటర్స్!

Director Harish Shankar: చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాం… డైరెక్టర్ హరీష్ శంకర్ షాకింగ్ కౌంటర్స్!

Director Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ ధమాకా మూవీ సక్సెస్ మీట్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. హీరో రవితేజను ఆకాశానికి ఎత్తిన ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్ మాస్ చిత్రాలను తక్కువ చేసి మాట్లాడే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మేధావులు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిజం కాదు కంటెంట్ ముఖ్యం. డాన్సులు, ఫైట్స్ సినిమాలను కాపాడలేవు. ఓటీటీ యుగంలో మాస్ చిత్రాలకు కాలం చెల్లినట్లే అని మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లకు చెప్పుతో కొట్టి మరీ సమాధానం చెప్పాము. హీరోయిజం, సాంగ్స్, ఫైట్స్ సినిమాను కాపాడలేవని కామెంట్స్ చేస్తున్నవారికి ధమాకా సక్సెస్ చెంప పెట్టు అని హరీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Director Harish Shankar
Director Harish Shankar

అనంతరం రవితేజను ప్రశంసల్లో ముంచెత్తాడు. వేదికపై రవితేజ కాళ్లకు నమస్కారం చేసిన హరీష్ శంకర్… ఆయన లేకపోతే నేను లేనన్నాడు. షాక్ మూవీతో నేను ఫ్లాప్ ఇచ్చినా మరలా నన్ను నమ్మి మిరపకాయ్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. ఆ రెండు చిత్రాలు నా జీవితాన్ని మార్చాయి. నా సెకండ్ మూవీ నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఆగిపోయింది. ఖతర్నాక్ మూవీ షూట్ చేస్తూ చెన్నైలో ఉన్న రవితేజ అన్న నాకు కాల్ చేశాడు. నీ నెక్స్ట్ మూవీ కూడా రవితేజతో ఉంటుందని ఆ నిర్మాతతో చెప్పు. నాకు కథ అవసరం లేదు, నీతో సినిమా చేస్తా అన్నారు. ఆ మాటలు నేనెప్పటికీ మర్చిపోలేనని హరీష్ ఎమోషనల్ అయ్యారు.

నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను డైరెక్టర్ గానే చూశాడు. అన్నయ్యతో నా ప్రయాణం కొనసాగుతుంది. ఆయన నాలాంటి ఎందరికో లైఫ్ ఇచ్చారని… హరీష్ సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా ధమాకా మంచి వసూళ్లు రాబట్టింది. ధమాకా రూ. 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ క్రాస్ చేసింది.

Director Harish Shankar
Director Harish Shankar

రవితేజ గత రెండు చిత్రాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ నిరాశపరిచిన నేపథ్యంలో ధమాకా విజయం ఆయనకు కీలకమైంది. కరెక్ట్ టైం లో రవితేజ హిట్ కొట్టాడు. శ్రీలీల ధమాకా మూవీలో హీరోయిన్ గా నటించారు. 2021 లో విడుదలైన క్రాక్ మూవీతో హిట్ కొట్టిన రవితేజ వరుసగా చిత్రాలు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణూ దేశాయ్ నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version