https://oktelugu.com/

Director Bobby- Chiranjeevi: ‘నువ్వు రాజకీయాలకు పనికి రావు అన్నయ్య’ అంటూ అభిమానుల సమక్షం లో సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్ బాబీ

Director Bobby- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యం లో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది..వేలాది మంది అభిమానుల సమక్షం లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుల పండుగగా జరిగింది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 9, 2023 / 08:39 AM IST
    Follow us on

    Director Bobby- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యం లో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది..వేలాది మంది అభిమానుల సమక్షం లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుల పండుగగా జరిగింది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    Director Bobby- Chiranjeevi

    ఆయన మాట్లాడుతూ ‘నేను చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా చూస్తూ మా నాన్న తో నాన్నా ఎదో ఒక రోజు నేను ఈయనతో సినిమా తీస్తాను..మన ఇద్దరం ఫ్రంట్ రో లో కూర్చొని చూస్తాము ఆ సినిమాని అని చెప్పాను..ఈరోజు మెగాస్టార్ తో సినిమా తీసాను..మా నాన్నా పైన నుండి చూస్తున్నాడు’ అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు డైరెక్టర్ బాబీ.

    waltair veerayya pre release event

    ఆ తర్వాత చిరంజీవి రాజకీయ ప్రస్తావన గురించి బాబీ మాట్లాడుతూ ‘అన్నయ్య..మీరు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మీతో సినిమా తియ్యాలనే కోరిక ఈ జన్మలో తీరదేమో అని అనుకున్నాను..కానీ దేవుడు వరం ఇచ్చినట్టు మీరు మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెట్టారు..నా కల నెరవేరింది..మీరు రాజకీయాలకు కరెక్ట్ కాదు అన్నయ్య..దానికోసం దేవుడు మీ తమ్ముడి రూపం లో జనాలకు బహుమతి గా ఇచ్చాడు..మీలోని ఆవేశం మరియు మంచితనం కలిపితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..మాటకు మాట..దెబ్బకి దెబ్బ తీసే మొనగాడు..నేను ఆయనతో పని చేశాను..ఇప్పుడు మీతో పని చేస్తున్నాను..మీ ఇద్దరిలో అదే మంచితనం..అదే ఉదారత్వం’ అంటూ బాబీ మెగా అభిమానుల మనసుల్ని దోచుకునే విధంగా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు.