అతడో అగ్ర నిర్మాత.. టాలీవుడ్ లోనే అందరు హీరోలు ఈయనతో సినిమా చేయాలని ఉబలాటపడుతుంటారు. అలాంటి నిర్మాత దిల్ రాజు ఇప్పటిదాకా ఎందరో హీరోలతో సినిమాలు చేసినా ఇలా థియేటర్ కు వెళ్లి ఇలా చేసింది లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం మాత్రం పూర్తిగా ఫ్యాన్ అయిపోయాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ ఫస్ట్ షోను ఈ ఉదయం దిల్ రాజు సతీసమేతంగా చూశాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలోని శివపార్వతి థియేటర్ లో నిర్మాత దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమా చూశాడు.
పవన్ ఎంట్రీ సీన్ కు అభిమానులతో కలిసి ఆయన కూడా కాగితాలు విసిరి సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక అగ్ర నిర్మాత ఇలా పవన్ కోసం థియేటర్ కు వెళ్లి సాధారణ ప్రేక్షకుడిలా కాగితాలు విసిరిన వైనం అందరినీ ఆకట్టుకుంది. దిల్ రాజు కూడా పవన్ ఫ్యాన్ గా మారిపోయాడని అంటున్నారు.
పవన్ అభిమానులు కూడా వకీల్ సాబ్ రిలీజ్ వేళ భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్లు అంతా గోల గోలగా ఉంది. సినిమా సూపర్ గా ఉందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అంటున్నారు.