Lakshmi Manchu: సోషల్ మీడియా లో తరచూ ఎదో ఒక కాంట్రవర్సీ లో ఉంటుంది మంచు కుటుంబం..ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ కుటుంబం చేసే ఓవర్ యాక్షన్ కి సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ సంఖ్య బాగా పెరిగింది..తనపై తన కుటుంబం పై ఇండస్ట్రీ కి చెందిన ఒక ప్రముఖ హీరో డబ్బులిచ్చి మరీ ట్రోల్ల్స్ చేయిస్తున్నారని..వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కూడా నాకు తెలుసు, త్వరలోనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అంటూ మంచు విష్ణు అప్పట్లో చాలా పెద్ద కామెడీ నే చేసాడు..ఇక ఆయన సంగతి కాసేపు పక్కన పెడుదాం.

మంచు లక్ష్మి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈమె అనవసరం గా విష్ణు లాగ ఎవరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చెయ్యదు కానీ..తనకి తెలియకుండానే తన నోటి నుండి వచ్చే కొన్ని మాటలు సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ల్స్ కి గురి అవుతుంటాయి.
రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది..ఈ ఇంటర్వ్యూ లో తనపై సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ గురించి మాట్లాడింది..ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ ని నేను పెద్దగా పట్టించుకోను..పని పాట లేకుండా కామెంట్స్ చేసేవాళ్ళని పట్టించుకుంటే నా విలువైన సమయం వేస్ట్ అవుతుంది.

ఈమధ్య ఒక న్యూస్ చూసాను..మంచు మనోజ్ ని మా కుటుంబం దూరం పెట్టేసింది..నాకు విష్ణు కి మధ్య మాటలు లేవని ఇలా పలు రకాల కామెంట్స్ వచ్చాయి..మనోజ్ ని నేను తరచూ కలుస్తూనే ఉంటాను..ఇక విష్ణు కి తన పిల్లలు మరియు బిసినెస్ తన ప్రపంచం..తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి..ఎంత బిజీ గా ఉన్నా మేము వారానికి ఒకసారైనా కలుస్తూ ఉంటాము..ప్రతీ ఒక్కటి మెరా కి చూపించలేము కదా’అంటూ మంచు లక్ష్మి కామెంట్ చేసింది.