
Oscar Awards 2023: ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిరామానులందరు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం రేపు జరగబోతుంది.ఎన్నడూ మన ఇండియన్స్ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం ఇంతలా ఎప్పుడూ ఎదురు చూడలేదు.అలాంటిది ఇప్పుడు ఎదురు చూడడానికి అసలు కారణం, మన ఇండియన్ సినిమా #RRR ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది.
రేపు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరి లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వస్తుందో లేదో తెలియనుంది.ప్రపంచం నలుమూళ్లలో ఉన్న ప్రతీ ఇండియన్ #RRR కి ఆస్కార్ అవార్డు రావాలని ఎంతగానో ప్రార్థిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ ఈవెంట్ ని ఎక్కడ చూడాలి , టెలికాస్ట్ అయ్యే ఛానల్ ఏమిటి అనే దానిపై అందరిలో సందేహం నెలకొంది.అలా ఈ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లైవ్ గా చూసేందుకు ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త.
ఈ అవార్డ్స్ ప్రదానోత్సవం లైవ్ లో చూడాలంటే డిస్నీ + హాట్ స్టార్స్ లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు చూడొచ్చు.ఈ వెసులుబాటు కేవలం డిస్నీ + హాట్ స్టార్ వినియోగదారులకు మాత్రమే.ఈ ఈవెంట్ కి హాట్ స్టార్ లో కనీవినీ ఎరుగని రేంజ్ వ్యూయర్ షిప్ వస్తుందని అంచనా వేస్తున్నారు, ఇది వరకు IPL మ్యాచులకు గాను డిస్నీ + హాట్ స్టార్ లో లైవ్ వ్యూయర్స్ సంఖ్య వంద మిలియన్ కి పైగా ఉండేది.

ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం కూడా అందరూ అంతలా ఎదురు చూస్తున్నారు.ఒకవేళ లైవ్ మిస్ అయ్యినా కూడా రికార్డెడ్ వీడియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది, కాబట్టి తెల్లవారుజామున లైవ్ ప్రసారం చేస్తున్నారు,మిస్ అవుతున్నామే అని ఎవ్వరు ఫీల్ అవ్వక్కర్లేదని హాట్ స్టార్ వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు.