Planes Water Salute: యూనిఫాం ఉద్యోగాల్లో సెల్యూట్ సాధారణం. పై అధికారి వచ్చినప్పుడు, అమరులకు నివాళులర్పించే సమయంలో పోలీసులు, ఆర్మీ జవాన్లు సెల్యూట్ చేస్తుంటారు. ఇక ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు పెద్దలకు గౌరవంగా నమస్కరిస్తారు. విష్ చేస్తారు. అయితే విమానయాన రంగంలో సెల్యూట్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ పైలెట్లతోపాటు, విమానాలకు ఈ సెల్యూట్ చేస్తారు. దీనినే వాటర్ సెల్యూట్ అంటారు. అది ఎలా చేస్తారు.. ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుందాం.
పైలెట్లపై బకెట్లతో నీళ్లు..
వాటర్ సెల్యూట్ అనగానే నీళ్లు ఉంటాయన్న విషయం అర్థమవుతుంది. అయితే వాటర్ సెల్యూట్ ఎలా చేస్తారు. ఎందుకు చేస్తారనేది తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా పైలెట్లుగా విమానయానరంగంలోకి అడుగు పెట్టి తొలి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినప్పుడు వారికి స్వాగతం పలికేందుకు, సంతోషాన్ని సీనియర్లతో పంచుకునేందుకు ఇలా సెల్యూట్ చేస్తారు. ఇందుకోసం కొత్తగా వచ్చిన పైలెట్లను ఎయిర్ పోర్టులో నిలబెట్టి బకెట్లతో నీళ్లు పోస్తారు. ఇక సీనియర్ పైలెట్ రిటైర అయిప్పుడు కూడా ఇలాగే చేస్తారు. ఇన్నాళ్లూ సర్వీస్ చేసి విధుల నుంచి రిటైర్ అవుతున్న సందర్భంగా అతనికి గౌరవం ఇవ్వడానికి రెండోసారి ఇలా వాటర్ సెల్యూట్ చేస్తారు.
విమానాలపైనా..
ఇక విమానాలకు కూడా వాటర్ సెల్యూట్ చేస్తారు ఎయిర్ పోర్టు సిబ్బంది. కొత్తగా వచ్చిన విమానం సురక్షితంగా ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే.. వాటర్ పైపులతో దానిపై రెండువైపులా నీటిని చల్లుతారు. తర్వాత విమానం తన చివరి ల్యాండింగ్ సమయంలోనూ ఇలాగే చేస్తారు. సర్వీస్ పూర్తి చేసుకున్న విమానాలపై మరోమాలు వాటర్ పైపులతో వాటర్ చల్లి గౌరవంగా సాగనంపుతారు.