https://oktelugu.com/

Director Trivikram: పొట్టకూటి కోసం త్రివిక్రమ్ ఆ స్టార్ కొడుక్కి పాఠాలు చెప్పాడా..!

Director Trivikram : టాలీవుడ్ ఇండస్ట్రీ లో వారసులుగా వచ్చిన వారికంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా సొంత కష్టం మీద పైకొచ్చిన వారిని అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో గౌరవిస్తారు.అలా జీరో నుండి కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీ లో నేడు టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న వ్యక్తి త్రివిక్రమ్.మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ అంటే ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటే చాలు మాస్ నుండి క్లాస్ […]

Written By:
  • Vicky
  • , Updated On : March 28, 2023 / 02:17 PM IST
    Follow us on

    Director Trivikram : టాలీవుడ్ ఇండస్ట్రీ లో వారసులుగా వచ్చిన వారికంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా సొంత కష్టం మీద పైకొచ్చిన వారిని అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో గౌరవిస్తారు.అలా జీరో నుండి కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీ లో నేడు టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న వ్యక్తి త్రివిక్రమ్.మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ అంటే ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్.

    ఆయన సినిమా వస్తుందంటే చాలు మాస్ నుండి క్లాస్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు క్యూ కట్టేస్తారు.ఒక్క పెద్ద సూపర్ స్టార్ హీరో కి ఉన్నంత ఇమేజి త్రివిక్రమ్ కి కూడా ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే ఈ స్థాయి ఆయనకీ ఊరికే రాలేదు.ఎన్నో కష్టాలు, ఎన్నో నిద్ర లేని రాత్రులు, చివరికి అన్నం తినడానికి కూడా డబ్బులు లేని రోజులు అనుభవిస్తే కానీ ఈ స్థాయికి చేరుకోలేదు.

    ప్రముఖ కమెడియన్ సునీల్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమవరం నుండి సినిమాల్లో నటించడానికి వచ్చారు.కెరీర్ ప్రారంభం లో ఇద్దరూ ఒక రూమ్ ని రెంట్ కి తీసుకున్నారు.దానికి అద్దెలు కట్టడానికి త్రివిక్రమ్ మరియు సునీల్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వతహాగా ఒక గొప్ప పండితుడు.న్యూక్లియర్ ఫిజిక్స్ లో అతనికి ఒక గోల్డ్ మెడల్ కూడా వచ్చింది.అంత గొప్ప పండితుడు కాబట్టే అప్పట్లో ఆయన ట్యూషన్స్ చెప్తూ తాను ఉంటున్న రూమ్ కి అద్దె కడుతుండేవాడు.అలా ఆయన ప్రముఖ కమెడియన్ గౌతమ్ రాజు కొడుక్కి కూడా అప్పట్లో ట్యూషన్ చెప్పేవాడట.

    అలాంటి స్థాయిలో ఉన్న త్రివిక్రమ్, చివరికి డైరెక్టర్ అయ్యి గౌతమ్ రాజు కే సినిమా అవకాశాలు ఇచ్చే రేంజ్ కి ఎదిగాడంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో చక్రం తిప్పుతున్న సూపర్ స్టార్స్ కూడా త్రివిక్రమ్ తో ఒక్క సినిమా చెయ్యడానికి పరితపిస్తుంటారు.టాలెంట్ పెట్టుకొని ఇండస్ట్రీ కి కొత్తగా వచ్చిన దర్శకులందరికి త్రివిక్రమ్ ఒక ఆదర్శం లాంటి వాడు.