https://oktelugu.com/

Sushanth : సుశాంత్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్నాడా..? పాపం చేసి ఉంటే రేంజ్ వేరేలా ఉండేది !

Sushanth : ఎంత బ్యాక్ గ్రౌండ్ సపోర్టుతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అదృష్టం మరియు సరైన ప్లానింగ్ లేకపోతే సక్సెస్ కాలేరు అనేందుకు ఉదాహరణగా నిల్చిన హీరోల లిస్ట్ జాబితా తీస్తే అందులో అక్కినేని సుశాంత్ కచ్చితంగా ఉంటాడు.చూసేందుకు అందమైన రూపం, నటన కూడా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఉంటుంది.కానీ కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేదు, ఫలితంగా కనీసం మీడియం రేంజ్ హీరో మార్కెట్ ని కూడా సంపాదించలేకపొయ్యాడు. ఇప్పుడు అవకాశాలు లేక […]

Written By:
  • NARESH
  • , Updated On : April 4, 2023 / 09:13 PM IST
    Follow us on

    Sushanth : ఎంత బ్యాక్ గ్రౌండ్ సపోర్టుతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అదృష్టం మరియు సరైన ప్లానింగ్ లేకపోతే సక్సెస్ కాలేరు అనేందుకు ఉదాహరణగా నిల్చిన హీరోల లిస్ట్ జాబితా తీస్తే అందులో అక్కినేని సుశాంత్ కచ్చితంగా ఉంటాడు.చూసేందుకు అందమైన రూపం, నటన కూడా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఉంటుంది.కానీ కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేదు, ఫలితంగా కనీసం మీడియం రేంజ్ హీరో మార్కెట్ ని కూడా సంపాదించలేకపొయ్యాడు.

    ఇప్పుడు అవకాశాలు లేక సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు.అక్కినేని లాంటి పెద్ద కుటుంబం నుండి వచ్చిన ఒక హీరో పరిస్థితి ఇలా అవుతుందని మనం బహుశా కలలో కూడా ఊహించి ఉండము.’అలా వైకుంఠపురం లో’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్రారంభించాడు సుశాంత్.ఇప్పుడు లేటెస్ట్ గా మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ చిత్రం లో కూడా ఒక కీలక పాత్ర పోషించాడు.

    ఈ సినిమా ఏప్రిల్ 7 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు సుశాంత్.ప్రతీ రోజు ఇంటర్వ్యూస్ ఇస్తూ క్షణం తీరిక లేకుండా తన డైరీ మొత్తాన్ని నింపేసుకున్నాడు.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన కెరీర్ లో మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.ప్రముఖ హీరో శర్వానంద్ నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రం ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా అప్పట్లోనే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

    అయితే ఈ సినిమా స్టోరీ ని తొలుత ఆ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ సుశాంత్ కి వినిపించాడట.కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నా చెయ్యి జారిపోయి, శర్వానంద్ చేతిలో పడి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది అంటూ చెప్పుకొచ్చాడు సుశాంత్.ఒకవేళ ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటే కచ్చితంగా ఆయన కెరీర్ కి ఎంతో ఉపయోగపడి ఉండేదని, ఇలా సపోర్టింగ్ రోల్స్ వేసుకునే స్థితి కచ్చితంగా ఉండేది కాదని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.