Naga Chaitanya – Shobitha : హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య అడ్డంగా బుక్ అయ్యాడు. రహస్యంగా లండన్ వెళ్లిన ఈ జంట అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లారు. ఆ రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగారు. ఆ క్రమంలో వెనుక టేబుల్ దగ్గర కూర్చున్న శోభిత కవర్ అయ్యారు. ఆ ఫోటోను సురేందర్ మోహన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. అది కాస్తా మీడియా దృష్టికి రావడంతో రచ్చ రంబోలా అయ్యింది. గతంలో కూడా శోభిత, నాగ చైతన్య లండన్ వీధుల్లో తిరుగుతున్నట్లు ఓ ఫోటో లీకైంది.
అది మార్ఫింగ్ ఫోటో అంటూ నాగ చైతన్య టీమ్ వెనకేసుకొచ్చారు. ఈసారి బుకాయించడానికి లేకుండా పోయింది. లండన్ కి చెందిన చెఫ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కాగా ప్రస్తుతం సురేందర్ మోహన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆ ఫోటో లేదు. నాగ చైతన్య అతన్ని బ్రతిమిలాడో, భయపెట్టో ఫోటో డిలీట్ చేయించాడని ప్రచారం జరుగుతుంది. సురేందర్ మోహన్ ఫోటో డిలీట్ చేయడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
గత ఏడాది నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాగ చైతన్య కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి తరచుగా ఆమెను తీసుకొచ్చి చూపిస్తున్నాడని, అక్కడ కలుసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. నాగ చైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కొందరు కావాలని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారనేది పూర్తిగా అవాస్తవం అంటూ ఆయన టీమ్ ఖండించారు. దీని వెనుక సమంత ఉందని వారు పరోక్షంగా చెప్పారు.
నాగ చైతన్య టీమ్ స్టేట్మెంట్ మీద సమంత ఫైర్ కావడం విశేషం. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒక అమ్మాయి మీద వచ్చే వార్తలు నిజం. అదే అబ్బాయి గురించి వస్తే… ఎవరో కలవాలని పుట్టిస్తున్నట్లు, అని ఆమె ట్వీట్ చేశారు. నాగ చైతన్య-శోభిత మధ్య ఏదో జరుగుతుందనేది నిజం. ఈ క్రమంలో నాగ చైతన్యతో సమంత విడిపోవడానికి ఈ ఎఫైరే కారణమా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్లో సమంత ‘నేను వైవాహిక జీవితంలో వంద శాతం నిజాయితీగా ఉన్నాను’ అని కామెంట్ చేశారు. నాగ చైతన్య లేడు అని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగా ఉంది.