
Vijay Deverakonda- Parashuram: దర్శకుడు పరశురాం చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఆయన ఎప్పుడు ఎవరి చంక ఎక్కుతారో అర్థం కావడం లేదు. అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని దిల్ రాజుతో మూవీ ప్రకటించి వివాదానికి తెరలేపాడు. అల్లు అరవింద్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేయబోయాడు. ఇంటికెళ్లి కలిసి ఆయన్ని శాంతింపజేశారు. లేదంటే పరుశురాం కెరీర్ మీద పెద్ద బ్లాక్ మార్క్ పడేది. నా నుండి నీకు భవిష్యత్తులో ఎలాంటి సహాయం ఉండదని పరశురాంకి అల్లు అరవింద్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడట.
విజయ్ దేవరకొండ హీరోగా మూవీ చేస్తానని గీతా ఆర్ట్స్ వాళ్లతో పరశురాం కమిట్ అయ్యాడు. అదే హీరోని తీసుకుపోయి వేరే నిర్మాతతో సినిమా ప్రకటించడం వివాదాస్పదమైంది. కాగా ఈ ప్రాజెక్ట్ కూడా అనూహ్య మలుపు తీసుకుందంటున్నారు. విజయ్ దేవరకొండను పక్కన పెట్టి కార్తీ మూవీ లైన్లో పెట్టాడట. నిర్మాత అనిల్ సుంకర నిర్మాతగా కార్తీతో పరశురాం మూవీ చేస్తున్నారట. దీనికి ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. విజయ్ దేవరకొండ కంటే కార్తీతో పరశురాం కమిటయ్యాడట. ఎప్పుడూ ఆ కమిట్మెంట్ తెరపైకి వచ్చిందట.
మే లేదా జూన్ నుండి రెంచ్ రాజు షూట్ ప్రారంభం కానుందిట. ఈ లోపు విజయ్ దేవరకొండ ఖుషి పూర్తి చేసుకుంటాడట. విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్టు ప్రకటించారు. మరి కార్తీ చిత్రాన్ని పరశురాం పూర్తి చేసే లోపు విజయ్ గౌతమ్ తిన్ననూరి మూవీ కూడా చేయవచ్చు. పరశురాం ప్రాజెక్ట్స్ అన్నింటిలో అయోమయం నెలకొంటుంది. సర్కారు వారి పాట చిత్రం అనంతరం నాగ చైతన్యతో మూవీ ఒప్పుకున్నాడు. స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ ప్రచారం జరిగింది.

అనుకున్నట్లే విజయ్ దేవరకొండతో పరశురాం కొత్త చిత్ర ప్రకటన చేశారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ మూవీ ఆయన సెట్స్ పైకి తీసుకెళతారని భావిస్తుండగా కార్తీ మూవీ తెరపైకి వచ్చింది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రాజెక్ట్స్ అనుకున్న ప్రకారం చేస్తామా లేదా అని ఆలోచించకుండా పరశురాం ఎడాపెడా అడ్వాన్సులు తీసుకుంటారట. పరశురాం సమస్యలకు ఇదే కారణం అంటున్నారు. ఉన్న విషయం చెప్పి చేయగలిగిన ప్రాజెక్ట్స్ కి మాత్రమే నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఏర్పడవని కొందరి వాదన.
