Chiranjeevi- Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ మేనియానే కనిపిస్తోంది.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వగా, మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం రేపు విడుదల కానుంది.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా ప్రొమోషన్స్ లో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

ఇంతకు ముందు కూడా చిరంజీవి ప్రొమోషన్స్ చేసాడు.. కానీ ‘వాల్తేరు వీరయ్య’ ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.. తాజాగా ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘అడ్డా’ ప్రోగ్రాం కి మెగాస్టార్ చిరంజీవి తన మూవీ టీం తో కలిసి పాల్గొన్నాడు..ఈ షో లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సరదా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఆయనలోని వింటేజ్ కామెడీ మొత్తాన్ని ఈ షో లో చూపించాడు.. ఆ ప్రోమోలు ఇప్పుడు వైరల్ గా మారాయి..
లేటెస్ట్ గా విడుదల చేసిన ఒక ప్రోమోలో సుమ మెగాస్టార్ ని ప్రశ్నలు అడుగుతూ ‘మీ ఫోన్ లో ఎవరెవరి నంబర్స్ ఎలా సేవ్ చేసుకున్నారో చెప్పండి’ అని అడుగుతుంది.. ముందుగా సురేఖ నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నారు అని అడగగా ‘రే’ అని చేసుకున్నాను అని చెప్తాడు చిరంజీవి.. ఆ తర్వాత రామ్ చరణ్ నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నారు అని అడగగా ‘చెర్రీ’ అని బదులిస్తాడు.

ఇక ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నారు అని అడగగానే ఆడిటోరియం మొత్తం అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోతుంది.. అప్పుడు చిరంజీవి దానికి సమాధానం చెప్తూ ‘పీకే నో లేదా పవనో కాదు కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నాను’ అంటూ సమాధానం ఇస్తాడు.. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది..ఈ శనివారం రోజు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది.