Sir Movie Full Review: నటీనటులు : ధనుష్ , సంయుక్త మీనన్,సముద్ర ఖని, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, సాయి కుమార్
బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : సూర్య దేవర నాగవంశీ
డైరెక్టర్ : వెంకీ అట్లూరి
మ్యూజిక్ డైరెక్టర్ : జీవి ప్రకాష్ కుమార్
విభిన్నమైన పాత్రలు చేస్తూ పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో ధనుష్.తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు ని దక్కించుకున్న ఏకైక నేటితరం సౌత్ ఇండియన్ స్టార్ హీరో ఆయన.సినిమా సినిమాకి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ నటుడిగా ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన ధనుష్ అంటే మన టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా బాగా ఇష్టమే.ఆయన డబ్బింగ్ సినిమాలను ఇక్కడ కొన్నిటిని ఆదరించారు కూడా.వాటిలో ‘రఘువరన్ బీటెక్’ సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది.ఇప్పుడు ఆయన తెలుగు లో నేరుగా ‘సార్’ అనే చిత్రం ద్వారా మన ముందుకి వచ్చాడు.నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా, ధనుష్ కి తెలుగు లో కూడా సూపర్ హిట్ దక్కిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
కథ :
ప్రస్తుతం మన సమాజం లో అన్ని వ్యాపారాలు లాగానే చదువు కూడా పెద్ద వ్యాపారం అయిపోయింది.చదువుకోవాలనే ఆశ ఉన్న ఎంతో మంది పేదవాళ్ళు స్తొమత లేక చదువులేకపోతున్న రోజులు ఇవి.ఇలాంటి పరిస్థితులకు పూర్తి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి బాలు అలియాస్ బాల గంగాధర్ తిలక్( ధనుష్).ఈయన ఒక సాధారణ డ్రైవర్ కొడుకు.జూనియర్ లెక్చరర్ గా పనిచెయ్యడం అతని వృత్తి.అనుకోకుండా ఆయనకీ సిరిపురం అనే గ్రామం లో ఒక ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా చేరాల్సి వస్తుంది.అక్కడ పనికి వెళ్లే కుర్రాళ్లను కళాశాలలో చేర్పించి చదువు నేర్పించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రతీ ఒక్కరిని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా చేస్తాడు.చదువుని వ్యాపారంగా మాత్రమే చూసే ఆ కాలేజీ ఓనర్ త్రిపాఠి (సముద్ర ఖని) నుండి బాలు కి ఇబ్బందులు ఎదురు అవుతాయి..వాటి అన్నిటినీ బాలు ఎలా ఎదురుకున్నాడు..అతని ప్రయాణం లో మీనాక్షి( సంయుక్త మీనన్) ఎలా పరిచయం అయ్యింది, అతనికి ఎలా సహాయపడింది?..చివరికి బాలు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ సమాజం లో ఉండే ఒక కీలకమైన సమస్యని డైరెక్టర్ వెంకీ అట్లూరి అందరికి అర్థం అయ్యేటట్టు కాస్త వినోదం మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పే ప్రయత్నం బాగానే చేసాడు కానీ, ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో గా ఉండడం సినిమాకి పెద్ద మైనస్ గా మారిందనే చెప్పాలి.స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేదు, రెగ్యులర్ గా మనం చూసే కమర్షియల్ ఎలిమెంట్స్ ఫార్మటు లోనే చెప్పాడు.కొత్తదనం లేకపోయినప్పటికీ బోర్ మాత్రం ఎక్కడా కొట్టాడు.అలా సాఫీగా ఫస్ట్ హాఫ్ మొత్తం నడిచిపోతుంది.కానీ సెకండ్ హాఫ్ మాత్రం మన హృదయాలను తాకే విధమైన సన్నివేశాలతో కంటతడి పెట్టించేలా చేసాడు డైరెక్టర్.ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రారంభమైన మొదటి 20 నిముషాలు బావోద్వేగంగా కూడిన సన్నివేశాలకు కనెక్ట్ అవ్వని ప్రేక్షకుడు అంటూ ఎవ్వరూ ఉండరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.,మ్యూజిక్ డైరెక్టరో జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన పాటలతో పాటుగా, సందర్భానుసారంగా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాడు..చాలా సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే ధనుష్ బాలు పాత్రలో నటించలేదు..జీవించాడనే చెప్పాలి.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన కనబర్చిన నటన గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.సినిమాలో కథ కంటే కూడా ఆయన నటనే మెయిన్ హైలైట్ గా నిలిచింది.ఇక హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్ తెర మీద అందంగా అయితే కనిపించింది కానీ , నటన కూడా చేసి ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ వస్తుంది.ఇక సముద్ర ఖని పాత్ర ఇటీవల విడుదలైన సినిమాల తరహాలోనే ఉంటుంది కానీ ఆయన పరిధిమేర బాగానే నటించాడు.హైపర్ ఆది కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది.
చివరి మాట : ప్రతీ ఒక్కరు కచ్చితంగా ఒకసారి అయితే చూడాల్సిన సినిమా ఇది ..ఫస్ట్ హాఫ్ స్లో గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించే విధంగా ఉంటుంది.
రేటింగ్ : 2.75/5