
Sir Movie Closing Collections: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించే నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ధనుష్ అంటే తెలుగు ఆడియన్స్ కి కూడా ఎప్పటి నుండో బాగా ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని మొత్తం రీసెంట్ గా విడుదలైన ‘సార్’ మూవీ ద్వారా చూపించారు ఆడియన్స్. ధనుష్ మొట్టమొదటి తెలుగు సినిమాగా ప్రచారమైన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. ఆ 5 కోట్ల రూపాయిలను ఈ సినిమా కేవలం మొదటి వీకెండ్ లోపే దాటేసింది. ఆరవ రోజు నుండి ఇక మొత్తం లాభాలే.
కొత్త సినిమాలు ప్రతీ వారం విడుదల అవుతున్నప్పటికీ కూడా ‘సార్’ మూవీ వసూళ్ల జోరు తగ్గలేదు,అలా దిగ్విజయంగా కొనసాగిన ‘సార్’ బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర మొత్తానికి ముగిసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఫుల్ రన్ లో కేవలం తెలుగు వెర్షన్ కి 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

అలా తమిళ వెర్షన్ కి కూడా కలిపి ఈ సినిమా సుమారుగా 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. మొత్తం మీద తెలుగు మరియు తమిళం వెర్షన్స్ కి కలిపి 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో పెట్టిన డబ్బులకు రెండింతల లాభాలు ఆర్జించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ద్వారా లాభాలు పొందిన బయ్యర్స్ కొడితే ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి అని ధనుష్ ని ప్రశంసిస్తున్నారు.