
Devi Sri Prasad Marriage: టాలీవుడ్ ఏజ్ బార్ బ్యాచిలర్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన ప్రస్తుత వయసు 43 ఏళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్డమ్ అనుభవించారు. రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండియాను తన మ్యూజిక్ తో అలరిస్తున్నారు. రాక్ స్టార్ అని పేరు గాంచిన దేవీశ్రీ పెళ్లి మాట ఎత్తడం లేదు. కోట్ల సంపాదన ఉన్నప్పటికీ ఎందుకో పెళ్లంటే భయపడుతున్నారు. దేవిశ్రీ పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. కొందరినైతే వివాహం చేసుకోబోతున్నాడని కథనాలు వెలువడ్డాయి. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.
అయితే ఎట్టకేలకు ఆయన మనసు పెళ్లి మీదకు మళ్లింది అంటున్నారు. పెద్దలు కుదిర్చిన అమ్మాయితో దేవిశ్రీ వివాహం జరగనుందట. ఈ మేరకు మాటామంతి కూడా అయ్యాయట. త్వరలో అధికారిక ప్రకటన రానుందట. ఇక అమ్మాయి వివరాలు పరిశీలిస్తే… వరసకు మరదలు అవుతుందట. అయితే వీరిద్దరికీ ఏజ్ లో భారీ వ్యత్యాసం ఉందట. దేవిశ్రీ కంటే చేసుకోబోయే అమ్మాయి 17 ఏళ్ళు చిన్నదట.
ప్రస్తుతం దేవిశ్రీ వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. ఆయన తండ్రి సత్యమూర్తి సినిమా రచయిత. 2015లో సత్యమూర్తి కన్నుమూసినట్లు సమాచారం. దేవిశ్రీకి తమ్ముడు ఉన్నాడు. అతని పేరు సాగర్. సింగర్ గా కొనసాగుతున్నాడు. దేవిశ్రీ కంపోజ్ చేసిన పలు హిట్ సాంగ్స్ సాగర్ పాడారు.

తమ్ముడు సాగర్ కి చాలా కాలం క్రితమే వివాహమైంది. దేవి మూవీతో దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఖడ్గం, మన్మథుడు చిత్రాలు దేవిశ్రీకి బ్రేక్ ఇచ్చాయి. టాప్ పొజిషన్ లో ఉన్న మణిశర్మను అధిగమించి నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్-దేవిశ్రీ మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరూ బ్యాచ్లర్స్ గానే ఉన్నారు.