Anchor Lasya Delivery : యాంకర్ లాస్యకు డెలివరీ అయ్యింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మార్చి 7వ తేదీన అబ్బాయి పుట్టినట్లు ఆమె వీడియో పోస్ట్ చేశారు. ఒకరోజు ఆలస్యంగా ఈ శుభవార్త అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కడుపులో బిడ్డ తంతున్నాడని లాస్య ఒక వీడియో పంచుకున్నారు. సడన్ గా నిన్న డెలివరీ అయినట్లు చెప్పి ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచేశారు. లాస్యకు ఇది రెండో సంతానం. మొదటి సంతానం కూడా అబ్బాయే. ఫస్ట్ కిడ్ పేరు జున్ను. అసలు పేరేంటో తెలియదు కానీ లాస్య దంపతులు జున్ను అని ప్రేమగా పిలుచుకుంటారు.
లాస్యకు అబ్బాయి పుట్టాడని తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం లాస్య మళ్ళీ తల్లయ్యారు. ఆమె మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పేరెంట్స్ కి తెలియకుండా రహస్య వివాహం జరిగింది. దాంతో లాస్య తండ్రి ఆమెను ఏళ్ల తరబడి దూరం పెట్టారట. తాను తల్లయ్యాక ఆయన మనసు కరిగిందని లాస్య బిగ్ బాస్ హౌస్లో వెల్లడించారు. లాస్య ఒకప్పుడు పాప్యులర్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. సడన్ గా ఆమె యాంకరింగ్ కి దూరమయ్యారు.
2020లో బిగ్ బాస్ షోతో మరలా వెలుగులోకి వచ్చారు. జనాలు ఆమెను గుర్తు చేసుకున్నారు. సీజన్ 4లో పాల్గొన్న లాస్య చాలా సాఫ్ట్ నేచర్ ప్రదర్శించారు. ఆమె కోప్పడ్డ సందర్భాలు చాలా తక్కువ. ఇంటి సభ్యుల కోసం చక్కగా వంట చేసేది. కాగా లాస్యది ఫేక్ స్మైల్ అని ప్రేక్షకులు తేల్చేశారు. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున ఒకటి రెండు సందర్భాల్లో ఆమెను నేరుగా అన్నాడు. కాదు సార్ అని లాస్య సమర్ధించుకునే ప్రయత్నం చేసింది.
అలాగే హౌస్లో ఆమె ఒక బ్యాచ్ ని మైంటైన్ చేశారు. అభిజీత్, హారిక, నోయల్ లతో ఆమె సన్నిహితంగా ఉండేవారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉంది. ఫైనల్ కి ముందు లాస్య ఎలిమినేట్ అయ్యారు. లాస్యకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. గర్భం దాల్చాక ఆమె యూట్యూబ్ వీడియోలు చేయడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులో ఉంటున్నారు. ప్రతి విషయం అభిమానులతో షేర్ చేస్తున్నారు.